South Africa Vs England: సుదీర్ఘ ఫార్మాట్లో బజ్ బాల్ గేమ్ ను ప్రవేశపెట్టిన ఘనత ఇంగ్లాండ్ జట్టుది. ఇటీవల భారత జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లోను ఇంగ్లాండ్ బీభత్సంగా పరుగులు చేసింది. పరిమిత ఓవర్లలోను సొంత గడ్డమీద ఇంగ్లాండ్ జట్టుకు తిరుగులేదు. పరుగుల వరద పారించే సత్తా ఆ జట్టు ఆటగాళ్లలో ఉంది. అయితే అటువంటి ఆటగాళ్లు సొంత గడ్డమీద తేలిపోయారు. మరీ దారుణంగా 50 ఏళ్ల క్రితం నాటి చెత్త రికార్డును తమ పేరు మీద నమోదు చేసుకున్నారు. ప్రొటిస్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఓటమిపాలయ్యారు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన ఇంగ్లాండ్.. సౌత్ ఆఫ్రికా చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది.
దక్షిణాఫ్రికా బౌలర్లు ఈ మ్యాచ్లో డేంజరస్ బౌలింగ్ వేశారు.. 50 ఓవర్లు కూడా పూర్తిస్థాయిలో ఆటలేకపోయారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. 25 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డారు.. లీడ్స్ లో జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ముందుగా బౌలింగ్ చేసింది. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఐదు పరుగులు చేసిన డకెట్ త్వరగానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జో రూట్ కొంతసేపు పరవాలేదు అనిపించినప్పటికీ.. 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.. స్మిత్, బ్రూక్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. 82 పరుగుల వద్దకు జట్టు స్కోర్ చేరుకున్న తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ గాలిలో మెడ అయింది.
రెండు వికెట్ల నష్టానికి 82 పరుగుల వద్ద ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. మిగతా 8 వికెట్లను 51 పరుగుల వ్యత్యాసంతో కోల్పోవడం విశేషం. బ్రూక్ అవుట్ అయిన తర్వాత మిగతా ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ జట్టుకు చెందిన ఏడుగురు బ్యాటర్లు రెండు అంకెల స్కోర్ కూడా చేయలేక పోయారంటే ఆఫ్రికా ఏ స్థాయిలో భవనం చేసినదో అర్థం చేసుకోవచ్చు. ఆతిథ్య జట్టు నుంచి స్మితి చేసిన 54 పరుగులే అత్యధికమైన స్కోరు.. బట్లర్ 15, బ్రూక్ పరుగులు చేశారు.
పరిమిత ఓవర్లలో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న కేశవ్ మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ వేసి.. నాలుగు కీలకమైన వికెట్లు సొంతం చేసుకున్నాడు. ముల్డర్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అతడు మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఎంగిడి, బర్గర్ తలా ఒక వికెట్ సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్ జట్టు కు పరిమిత ఓవర్లలో రెండవ అత్యల్ప స్కోర్ ఇది. ఇదే వేదికగా 1975 వరల్డ్ కప్ లో కంగారు జట్టు పై ఇంగ్లాండు 93 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. మళ్లీ ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత అత్యల్ప స్కోరును ఇంగ్లాండు జట్టు చేసింది. ఇంగ్లాండ్ విధించిన 132 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి సాధించింది..మార్క్రామ్ 86 పరుగులు చేసి సత్తా చాటాడు.
REALLY UNBELIEVABLE CATCH BY
RICKELTON pic.twitter.com/08iYnskjDc— Khan (@Khanmohammed12) September 2, 2025