South Africa Vs England: ఇటీవల ఇంగ్లాండ్ దేశంలో టీమ్ ఇండియా పర్యటించింది. ఐదు టెస్టుల సిరీస్ ను సమం చేసింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ సిరీస్ లో టీమిండియా ఆద్యంతం అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. పర్యటక జట్టుగా అద్భుతాలు సృష్టించింది. అందువల్లే ఇంగ్లాండ్ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. భారత్ వేసిన పునాదులను దక్షిణాఫ్రికా ఇప్పుడు సమర్థవంతంగా ఉపయోగించుకున్నది. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకుంది.
Also Read: కవిత కోపం హరీశ్‌పై కాదా.. మరి టార్గెట్ ఎవరు?
ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో లీడ్స్ లో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండవ వన్డే లార్డ్స్ లో జరగగా.. పర్యటక జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి ఎనిమిది వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. పర్యటక జట్టులో బ్రిట్జీ కీ 85, స్టబ్స్ 58 పరుగులతో ఆకట్టుకున్నారు. ఆతిథ్య జట్టులో ఆర్చర్ 4 వికెట్లు, రషీద్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.. ఆ తర్వాత 331 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆతిథ్య జట్టు 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇంగ్లాండ్ జట్టులో బట్లర్, రూట్ 61 పరుగులు చేశారు. బెతల్ 58 పరుగులతో ఆకట్టుకున్నాడు.. అయినప్పటికీ ఆతిథ్య జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. పర్యాటక జట్టులో బర్గర్ 3, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు సాధించారు. వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి దక్షిణాఫ్రికా సిరీస్ సొంతం చేసుకుంది. బ్రిట్జ్ కీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ సౌత్ అంప్టన్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ మొదలవుతుంది.
వాస్తవానికి ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసినప్పటికీ.. దానిని ఛేదించడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా కష్టపడ్డారు. దూకుడు అయిన ఇన్నింగ్స్ ఆడారు. అయితే దానిని చివరి వరకు కొనసాగించడంలో విఫలమయ్యారు. చివరి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు విజయానికి 26 పరుగులు అవసరమైన సందర్భంలో.. ఆర్చర్ దూకుడు వల్ల ఇంగ్లాండ్ 20 పరుగులు సొంతం చేసుకుంది. అయితే అవేవి కూడా ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. అయితే ఆర్చర్ దూకుడు వల్ల ఇంగ్లాండ్ జట్టు గెలిచే విధంగా కనిపించినప్పటికీ.. మరో ఎండ్ లో అతడికి సహకారం లభించకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోక తప్పలేదు.
Beautiful Lord’s Cricket Ground for the England vs South Africa 2nd ODI last night.
The last international match of the season at this venue.
— Cricket Business HQ (@cric_businessHQ) September 5, 2025