
India Vs England 4th Test: మళ్లీ టీమిండియాది అదే కథ.. అదే వ్యథ. ఇంగ్లండ్ గడ్డపై తొలి రెండు టెస్టులు భీకరంగా పోరాడిన టీమిండియా మూడో టెస్ట్ నుంచి ఫ్లేటు ఫిరాయించింది. ఇంగ్లండ్ బౌలర్లకు దాసోహమవుతోంది. ఏమాత్రం పోరాట పటిమ లేకుండా కోహ్లీ నుంచి పంత్ వరకూ అందరూ క్యూ కట్టేస్తున్నారు.
ఇంగ్లిష్ బౌలర్ల స్వింగ్ కు టాపార్డర్ విఫలమైన చోట.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధశతకంతో ఆకట్టుకుంటే.. 127/7 తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును శార్దూల్ ఠాకూర్ తన మెరుపులతో ఆదుకున్నాడు. నిఖార్సైన బ్యాట్స్ మెన్ ను తలపిస్తూ టీ20 తరహాలో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా భారత జట్టు ఓ మోస్తారు స్కోరు చేయగా.. ఆనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా బుల్లెట్ లు సంధిస్తే.. ఉమేశ్ తన అనుభవాన్నంతా రంగరించి రూట్ ను పెవిలియన్ చేర్చాడు.
ఇంగ్లండ్ తో 4వ టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అంతా విఫమైన వేళ బౌలర్ శార్ధుల్ ఠాకూర్ 50 పరుగులతో దంచికొట్టడంతో టీమిండియా ఆమాత్రం స్కోరైనా సాధించింది.
అనంతరం ఇంగ్లండ్ జట్టు 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆడుతోంది. రెండోరోజు ఇంగ్లండ్ భారీ స్కోరు సాధిస్తే టెస్ట్ ఆ జట్టుదే. ఇక చేయకపోతే టీమిండియాకు ఆశలు ఉంటాయి.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు రాహుల్, రోహిత్ నుంచి పంత్ దాకా అందరూ క్యూ కట్టగా.. కెప్టెన్ కోహ్లీ మాత్రం ఔట్ అయ్యే ప్రమాదం తప్పించుకొని 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. వోక్స్ 4, రాబిన్సన్ 3 వికెట్లతో భారత్ ను కుప్పకూల్చాడు.
బుమ్రా వరుసగా తొలి స్పెల్ లోనే రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్కు షాకిచ్చాడు. భీకర ఫామ్ లో ఉన్న రూట్ ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేయడంతో భారత్ కు ఊరట కలిగింది.
చివర్లో 150 లోపు ఔట్ కావడం ఖాయం అనుకున్న సమయంలో బౌలర్ శార్ధుల్ ఠాకూర్ దంచి కొట్టడంతో టీమిండియా 191 పరుగులు చేయగలిగింది. లేకుంటే 120లోపే చాపచుట్టేసింది. ఈరోజు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆడే తీరును బట్టి ఈ టెస్ట్ మ్యాచ్ ఆధారపడి ఉంటుంది.
– 4వ టెస్ట్ మొదటి రోజు హైలెట్స్