Eng Vs Ind 3rd Test: లార్డ్స్ లో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మూడో టెస్ట్ మూడో రోజు ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాత మైదానంలో హై వోల్టేజ్ వాతావరణం నెలకొంది. ఇప్పటిదాకా స్నేహపూర్వకంగా జరిగిన ఈ సిరీస్.. లార్డ్స్ లో మాత్రం మరో టర్న్ తీసుకుంది. దీంతో టెస్ట్ కాస్త హాట్ హాట్ గా మారింది. ఇరుజట్ల ప్లేయర్ల మధ్య జరిగిన సంవాదం ఒక్కసారిగా వివాదంగా మారింది. మాటలు దొర్లాయి. పరస్పరం సవాళ్లు చేసుకునే స్థాయికి వెళ్లాయి. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులు చేసింది. ప్రతిగా భారత్ కూడా అంతే స్కోర్ చేసింది. భారత జట్టులో రాహుల్ సెంచరీ చేశాడు.. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా అర్ద సెంచరీల తో ఆకట్టుకున్నారు.
Also Read: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
గిల్ సేన 387 పరుగులకు ఇన్నింగ్స్ ను ముగించిన తర్వాత ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొలి ఓవర్ బుమ్రా వేశాడు. క్రావ్ లే స్ట్రైకర్ గా ఉన్నాడు. తొలి బంతిని డిపెండ్ చేశాడు. రెండవ బంతిని ఫ్లిక్ చేశాడు. తద్వారా రెండు పరుగులు వచ్చాయి ఇక మూడవ బంతిని గుడ్ లెంగ్త్ ఆఫ్ స్టంప్ వైపు వేశాడు. ఇక అప్పటినుంచి ఇంగ్లాండు ఓపెనర్ క్రావ్ లీ తన అతి తెలివిని ప్రదర్శించాడు. పదే పదే బుమ్రా బౌలింగ్ కు అంతరాయం కలిగించాడు. బుమ్రా రన్నప్ ను రెండు సందర్భాల్లో అడ్డగించాడు. దీంతో భారత ఆటగాళ్లకు కోపం పెరిగిపోయింది. ముఖ్యంగా సిరాజ్ అయితే విరాట్ కోహ్లీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్టు చెలరేగిపోయాడు. తన నోటికి పని చెప్పి ఇంగ్లాండ్ ప్లేయర్లను దూషించాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ ఓపెనర్లు తమ తీరు మార్చుకోలేదు. పైగా క్రావ్ లీ భారత ఆటగాళ్లపై ఎదురుదాడికి దిగాడు. దీంతో భారత ప్లేయర్లు మొత్తం చుట్టూ చేరి చప్పట్లు కొట్టి హేళన చేశారు. బుమ్రా ను ధైర్యంగా ఎదుర్కోలేక క్రావ్ లీ పదేపదే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. మరొకరు పడకుండా.. సమయాన్ని వృధా చేశారు..
క్రావ్ లీ ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ అసహనం వ్యక్తం చేశాడు. బుమ్రా బౌలింగ్ లో భయపడుతున్నావా అంటూ ఎగతాళి చేశాడు. బుమ్రా లయను దెబ్బతీయడానికి క్రావ్ లీ చిన్న గాయానికి కూడా మైదానంలోకి ఫిజియోలను పిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. కీలకమైన ప్లేయర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు రెండవ ఇన్నింగ్స్ లో తొలి ఓవర్ బుమ్రా వేశాడు. బంతిని అందుకున్న తర్వాత ఇంగ్లాండ్ ఓపెనర్ క్రావ్ లీ లో భయం మొదలైంది. అందువల్లే అతడు అలా చేసి ఉంటాడని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మూడోరోజు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ప్లేయర్ల మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో.. ఆదివారం నాలుగో రోజు ఆట మరింత రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.. నాలుగో రోజు టీమిండియా బౌలర్లు ఇంగ్లాండ్ ప్లేయర్లను త్వరగా ఆల్ అవుట్ చేయగలిగితే మ్యాచ్ మీద భారత జట్టు పట్టు బిగించడానికి అవకాశం ఉంటుంది.
View this post on Instagram