Brahmanandam Tribute to Kota Srinivasarao: కోటా శ్రీనివాసరావు భౌతికకాయానికి బ్రహ్మానందం నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా కోటా పార్ధీవదేహాన్ని చూసి ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు. శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చారు. బ్రహ్మానందాన్ని రాజేంద్ర ప్రసాద్ ఓదార్చారు. బ్రహ్మానందం, బాబూమోహన్, ఆలీ లాంటి ఎంతో మంది కమెడియన్లకు కోటా నటనలో ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చేవారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.