Dil Raju Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు(Dil Raju)… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అందుకే ఆయన బ్యానర్ నుంచి వచ్చిన ప్రతి సినిమాను ప్రేక్షకులు చూడడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అతని సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా గత కొన్ని రోజుల నుంచి దిల్ రాజు కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆయన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు ఏవి ప్రేక్షకుల్లో మెప్పించలేకపోతున్నాయి తద్వారా సక్సెస్ ని సాధించలేకపోతున్నాయి. వెంకటేష్ (Venkatesh) హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vastunnam) సినిమాని మినహాయిస్తే మిగిలిన ఏ సినిమా కూడా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించడం లేదు.
రీసెంట్ గా వచ్చిన తమ్ముడు(Thammudu) సినిమా సైతం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మరి ఇకమీదటైనా ఆయన చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలనే ఉద్దేశ్యంలో భారీ బడ్జెట్ తో ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా కూడా అతనికి ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించి పెట్టలేదు. దాంతో ఇప్పుడు ఆయన మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.
Also Read: ఆ ఒక్క మాటతో పవన్, బాలయ్యల నోళ్లు మూయించిన రోజా..పంచ్ అదుర్స్
ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు తమ్ముడు అయిన శిరీష్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో గేమ్ చేంజర్ గురించి మాట్లాడి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు క్షమాపణలు చెప్పిన విషయం మనకు తెలిసిందే… ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు శిరీష్ ఇద్దరు సొంత బ్రదర్స్ కాదట.
అన్నదమ్ముల కొడుకులు అంటూ దిల్ రాజు వాళ్ళ తమ్ముడు శిరీష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మొన్నటి దాకా శిరీష్ అంటే దిల్ రాజు వాళ్ళ ఓన్ బ్రదర్ అని అందరూ అనుకున్నారు కానీ అలా కాదని శిరీష్ క్లారిటీ ఇచ్చాడు…దిల్ రాజు కి ఇద్దరు ఓన్ బ్రదర్స్ ఉన్నారు వాళ్లలో ఒకరి కొడుకు అయిన హర్షిత్ రెడ్డి ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా చిన్న సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
Also Read: అమెరికా గడ్డపై తెలుగువాళ్ళ గురించి గూస్ బంప్స్ స్పీచ్ ఇచ్చిన అల్లు అర్జున్!
ఇక ఇంకో బ్రదర్ కొడుకు వాళ్ళ సినిమా థియేటర్లకు సంబంధించిన పనులను చూసుకుంటూ ఉంటాడట…ఇక కెరియర్ మొదటి నుంచి కూడా దిల్ రాజు శిరీష్ ఇద్దరు ఓన్ బ్రదర్స్ గానే సినిమా ఇండస్ట్రీలో అందరికి తెలుసు… కానీ వాళ్ళు కజిన్ బ్రదర్స్ అనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు అంటూ శిరీష్ ప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…