Homeఎంటర్టైన్మెంట్TANA 2025 Highlights: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు...

TANA 2025 Highlights: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!

TANA 2025 Highlights: ప్రతీ ఏడాది నార్త్ అమెరికా లో అంగరంగ వైభవంగా TANA (Telugu Association of North America) సెలబ్రేషన్స్ జరగడం మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది కూడా ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి ఈ ఈవెంట్ నార్త్ అమెరికా లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun),సమంత(Samantha Ruth Prabhu), శ్రీలీల(Sreeleela),సుకుమార్(Sukumar), దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు((Raghavendra Rao) తదితరులు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ ని కూడా ఈ ఈవెంట్ లో అందించారు. అనంతరం సినీ ప్రముఖులందరూ ఉపన్యాసాలు అందించారు. ముఖ్యంగా రాఘవేంద్ర రావు మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వివాదాస్పదం గా మారాయి. అల్లు అర్జున్ అభిమానులకు ఈ మాటలు అసలు నచ్చడం లేదు. అంతలా ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.


ఆయన మాట్లాడుతూ ‘చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇది నా ఇరవై ఏళ్ళ దర్శక ప్రస్థానం. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ కి నేను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా సుకుమార్ గురించి నేను మాట్లాడాలి. ఆయనకు నాకు కామన్ పోలిక ఒకటి ఉంది. అది ఏమనుకుంటున్నారు మీరు?..గెడ్డం. మరో పోలిక ఏమిటంటే అడవి రాముడు సమయం లో నేను అడవి ని నమ్ముకున్నాను స్టార్ డైరెక్టర్ ని అయ్యాను. నువ్వు కూడా పుష్ప ని నమ్ముకున్నావ్ స్టార్ డైరెక్టర్ అయ్యావ్, అల్లు అర్జున్ ని స్టార్ హీరోని చేశావ్. అదే విధంగా మా శ్రీలీల తో ఐటెం సాంగ్ చేయించి పాన్ ఇండియా స్టార్ ని చేశావ్. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్లందరికీ నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మన తెలుగోళ్లు అమెరికా లో అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ని ఈ వీడియో చూపించి వేరే లెవెల్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్స్. ఎందుకంటే అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యింది ‘పుష్ప’ చిత్రం తోనే అని,అంతకు ముందు కేవలం ఒక మామూలు మీడియం రేంజ్ హీరో అని అంటున్నారు. కానీ మార్కెట్ పరంగా చూసుకుంటే ఓపెనింగ్స్ లో అల్లు అర్జున్ గతం లో స్టార్ హీరోలకు చాలా దూరం గా ఉండేవాడు అనేది వాస్తవం. సరైనోడు చిత్రం వరకు అల్లు అర్జున్ కి అసలు ఓపెనింగ్స్ వచ్చేవి కాదు. టాక్ బాగుంటే లాంగ్ రన్ లో మంచి వసూళ్లు వచ్చేవి కానీ, ఓపెనింగ్స్ లో తక్కువనే. పుష్ప 2 తోనే ఆయన కెరీర్ మొట్టమొదటి ఓపెనింగ్ రికార్డు ని అందుకున్నాడు. అందుకే సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఇలా ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular