Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ కింగ్ కోహీ(Kohli) దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్‌లో అంచెలంచెలుగా ఎదిగాడు. సారథ్యం కూడా వహించాడు. పరుగుల వేటలో అనేక రికార్డులు కొల్లగొట్టాడు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పటికే అభిమానులు అతనిపై గుర్రుగా ఉన్నారు. ఈ తరుణంలో కోహ్లీ మరో అహంకార పూరిత చర్యతో ఏకంగా ఇండియన్ ఆర్మీ(Indian Army)నే అవమానించి విమర్శలపాలవుతున్నారు. ఓ సెల్ఫీ కారణంగా వివాదంలో చిక్కుకున్నాడు.
ఏం జరిగిందటే..
ముంబైలో ఉంటున్న విరాట్ కోహ్లీ తాజ్ హోట్ ముందు కారు ఆపి దిగి నడుచుకుంటూ వెళ్లాడు. ఈ సందర్భంగా ఆర్మీ(సీఐఎస్‌ఎఫ్)జవాన్ అతడిని గమనించాడు. వెంటనే కోహ్లీ దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగాలని అడిగాడు. కోహ్లీ సెల్ఫీ ఇవ్వకపోగా.. ఓవరాక్షన్(Over action) చేశాడు. నీకు బుర్ర ఉందా.. అన్నట్లుగా వాగ్వాదానికి దిగాడు. కోహ్లీ కోపాన్ని చూసి జవాన్ వెనక్కి తగ్గాడు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ కోహ్లీని క్రికెట్ ఆడుకుంటున్నారు. కోహ్లీ క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియా(Social Media)లో పోస్టులు పెడుతున్నారు.
వీడియో వైరల్..
జవాన్‌పై కింగ్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీంతో విరాట్ అంటే పడనివారు దీనిని వైరట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు స్పందిస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. ఇండియన్ ఆర్మీ అంటే విరాట్‌కు ఏమాత్రం గౌరవం లేదని మండిపడుతున్నారు. ఓ ఆర్మీ జవాన్‌తో ఇలాగేనా స్పందించేంది అని ప్రశ్నిస్తున్నారు. జాతీయ స్థాయి క్రీడాకారుడు అయి ఉండి ఆర్మీతో ఇలా వ్యవహరిండం ఏంటి ఆని మండిపడుతున్నారు. కోహ్లీ నీకెందుకు ఇంత అహంకారం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జవాన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
View this post on Instagram