Dhoni IPL Retirement : గడిచినం నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సీజన్లో ధోని రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే అతడు వయసు పై పడుతున్నా కొద్దీ తన సామర్థ్యాన్ని, ఫామ్ ను కాపాడుకుంటున్నాడు.. ఒక్కో సీజన్ ను వస్తున్నాడు. అయితే తాజాగా చెన్నై వేదికగా ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ కు ధోని తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకీదేవి హాజరయ్యారు. దీంతో మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ నుంచి వీడ్కోలు పలుకుతాడని ప్రచారం ఊపందుకోవడం మొదలుపెట్టింది. ఇక ధోని తన ఐపీఎల్ కెరియర్ కు ముగింపు పలికినట్టేనని అందరూ కాంచన కొచ్చారు. అయితే త్వరలో బెంగళూరు తో జరిగే మ్యాచ్ కు ముందు ధోని ఐపీఎల్ కు వీడ్కోలు పలికే అంశం గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా కీలకమైన విషయాలను వెల్లడించాడు. ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో ధోని గతంలో మాదిరిగానే చివర్లో బ్యాటింగ్ కు వస్తున్నాడు. తన దైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో ధోని 76 పరుగులు స్కోర్ చేశాడు. 0, 30*, 16, 30* పరుగులు చేశాడు. ఇక వాయువేగంతో రెండు స్టంప్ అవుట్లు.. ఒక రనౌట్ చేశాడు. మహేంద్ర సింగ్ వికెట్ కీపింగ్ అద్భుతంగా చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది. ఇక బ్యాటింగ్ లోనూ ధోని కనక దూకుడు ప్రదర్శిస్తే.. అతడికి తిరుగులేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. అతడి బ్యాటింగ్ ఆర్డర్ పై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అతడిని ద్వేషించేవారు, మాజీ ఆటగాళ్లు.. మహేంద్ర సింగ్ ధోని ఐపిఎల్ కు వీడ్కోలు పలకాలని హితవు పలుకుతున్నారు..
Also Read : ధోని రిటర్మెంట్..CSK కోచ్ కీలక ప్రకటన..
చర్చ జరుగుతూనే ఉంది
ఇక ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని తల్లిదండ్రులు హాజరు కావడంతో అందరూ ఆశయానికి గురయ్యారు. జరుగుతున్న ప్రచారాన్ని తగ్గట్టుగా ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అని అందరు భావించారు.#Dhoniretirement అనే యాష్ ట్యాగ్ ను తెగ ట్రెండ్ చేశారు. అయితే దీనిపై మహేంద్ర సింగ్ ధోని క్లారిటీ ఇచ్చాడు.. ” నేను ఇంకా ఐపీఎల్ లోనే యాక్టివ్ క్రికెటర్ గా ఉన్నాను. నా వయసు 43 సంవత్సరాలు. జూలై నాటికి 44 లోకి ప్రవేశిస్తాను. మరో సీజన్ ఆడాలా? లేదా? అనేది నా శరీరం నిర్ణయిస్తుంది. దానికి సంబంధించి ఇంకా 10 నెలల సమయం ఉంది. ఇప్పుడు నేను ఆడే విషయంలో నిర్ణయం తీసుకోలేను.. నేను ఇంకా ఐపీఎల్ ప్రయాణానికి సాగించగలనా? లేదా? అనేది నా శరీరం నిర్ణయిస్తుందని” ధోని క్లారిటీ ఇచ్చాడు. మొత్తంగా తన రిటర్మెంట్ కు సంబంధించి వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.