HomeతెలంగాణKCR: 348.43 కోట్లకు కేసీఆర్ నమస్తే.. ఇందులోనైనా రేవంత్ ఫిక్స్ చేస్తాడా?

KCR: 348.43 కోట్లకు కేసీఆర్ నమస్తే.. ఇందులోనైనా రేవంత్ ఫిక్స్ చేస్తాడా?

KCR: కేటీఆర్ కు అత్యంత అనుచరుడు కొణతం దిలీప్ విదేశీ పర్యటనల ఖర్చు.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి అదనపు వ్యయం.. ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు. కానీ ఏ ఒక కేసులోనూ కెసిఆర్ ను రేవంత్ రెడ్డి ఇరికించలేదు. ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. ఏదో అనుకూల మీడియాలో గట్టి ప్రచారం తప్ప.. ఇంతవరకు ఊదు కాలింది లేదు.. పీరి లేచింది లేదు.. ఇక ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమస్తే తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. గతంలో ఇది లక్ష్మీ రాజానికి చెందింది.

Also Read: తెలంగాణ సీఎస్ కు కీలక పదవి ఇస్తోన్న సీఎం రేవంత్

అధికారంలోకి వచ్చిన తర్వాత కెసిఆర్ దీనిని ఓన్ చేసుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజ్ న్యూస్ అప్పటి టిఆర్ఎస్ గొంతుగా ఉండేది. ఇది తెలంగాణ భవన్ కేంద్రంగానే చాలా రోజులపాటు కార్యకలాపాలు సాగించింది. అధికారంలో ఉన్నన్ని రోజులు నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలంగాణ టుడే పేపర్లకు విపరీతంగా ప్రభుత్వ ప్రకటనలు వచ్చేవి. గత పది సంవత్సరాలలో ఈ మీడియా సంస్థలకు ప్రభుత్వం 348.43 కోట్లను ప్రకటనల రూపంలో ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారుల బృందం ప్రాథమికంగా గుర్తించింది. దీనికి సంబంధించిన దర్యాప్తుని కూడా మొదలుపెట్టింది. ఇక ఇదే విషయంపై సమాచార శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ గా అయిన విమర్శలు చేశారు..” పత్రికలకు సర్కులేషన్.. చానల్స్ కు రేటింగ్ ఆధారంగా టారిఫ్ ఇస్తారు. గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సమయంలో సొంత మీడియా కోట్ చేసిన ధరకు సమాచార అధికారులు ఒకే చెప్పారని” ఇటీవల పొంగులేటి ఆరపించారు.

ఇక సమాచార శాఖలో పనిచేస్తున్న విశ్రాంత అధికారులు కూడా టిఆర్ఎస్ సొంత మీడియా గా పేరుపొందిన తెలంగాణ టుడే విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. నిబంధన ప్రకారం ఒక పత్రిక 18 నెలల పాటు నిరంతరాయంగా పబ్లిష్ అవ్వాలి. ఆ తర్వాత ఇంకా గవర్నమెంట్ యాడ్స్ జారీకి ఎం ప్యానల్ లో చోటు దక్కించుకోవాలి. ఆ తర్వాతే దానికి ప్రకటనలు ఇవ్వాలి. కానీ తెలంగాణ టుడే ఏర్పాటైన మూడు నెలలకే ఆ పత్రికకు ప్రకటనలు ఇవ్వాలని ఉత్తరుడు జారీ అయ్యాయని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ ఉత్తర్వులు ఇచ్చింది ఎవరు? వాటిపై సంతకాలు చేసింది ఎవరు.. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించకుండా మౌఖిక ఆదేశాలతోనే కథ మొదలు పెట్టారా.. అనే అంశాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తులోనే ఇంత వ్యవహార సాగితే.. ఇక తవ్వుతుంటే ఎన్ని విషయాలు తెలుస్తాయో చూడాల్సి ఉంది. మరి దీనిపైనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా దృష్టి సారిస్తుందా.. కెసిఆర్ ను ఫిక్స్ చేస్తుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఈ కేసు కూడా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్తే.. ఇకపై కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన ఏ కేసు కూడా ముందుకు వెళ్లదనే అనుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular