IPL trophy 2025 : ఇక ఐపీఎల్ లో సెలవు దినమైన ఆదివారం నాడు డబుల్ హెడర్స్ మ్యాచ్లు జరుపుతారు. కానీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో నేడు (ఆదివారం) ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగుతోంది. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ (SRH vs GT) మ్యాచ్ ఆడుతున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. అయితే ఆదివారం నాడు ఒకే ఒకే మ్యాచ్ నిర్వహించడం ఏంటని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేడు రెండు మ్యాచ్లు జరగాల్సి ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మధ్యాహ్న 3 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ జరగాలి. సాయంత్రం కోల్ కతా వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగాలి. అయితే నేడు శ్రీరామనవమి కావడంతో తాము అంతగా బందోబస్తు ఇవ్వలేమని కోల్ కతా పోలీసులు స్పష్టం చేయడంతో..కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచును రీ షెడ్యూల్ చేశారు.
Also Read : నా రిటర్మెంట్ పై అదే నిర్ణయిస్తుంది.. ధోని సంచలన వ్యాఖ్యలు
శ్రీరామనవమి నేపథ్యంలో
శ్రీరామనవమి వేడుకలను కోల్ కతా లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శోభయాత్రను కూడా అదే స్థాయిలో జరుపుతారు. కోల్ కతా అతి పెద్ద నగరం. పైగా ఇక్కడ గొడవలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందువల్లే కోల్ కతా పోలీసులు మ్యాచ్ నిర్వహిస్తే తాము బందోబస్తు కల్పించలేమని స్పష్టం చేయడంతో ఐపీఎల్ నిర్వాహక కమిటీ కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచును రీ షెడ్యూల్ చేసింది. అంతేకాదు శ్రీరామ నవమి వేడుకల నేపథ్యంలో భద్రత కు సంబంధించి కోల్ కతా పోలీసులు స్పష్టమైన వైఖరిని వెల్లడించడంతో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్, బీసీసీఐ మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేశాయి. అయితే వాయిదా పడిన మ్యాచును మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు నిర్వహిస్తారు. ఇక అదే రోజు సాయంత్రం కింగ్స్ 11 పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు మ్యాచ్ నిర్వహిస్తారు.. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా కోల్ కతా పోలీసులు భద్రతకు సంబంధించి తమ వైఖరిని స్పష్టం చేయడంతో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను వాయిదా వేశారు. అందువల్లే నేటి ఆదివారం ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగుతోంది. అయినప్పటికీ అభిమానులకు అద్భుతమైన క్రికెట్ ఆనందం లభిస్తుందని.. సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడతాయని ఐపీఎల్ నిర్వాహ కమిటీ చెబుతోంది.
Also Read : విజయ్ శంకర్ తో మైండ్ గేమ్..అక్షర్ పటేల్ తెలివి మామూలుగా లేదు.