Ms Dhoni: ఈ మ్యాచ్ లో ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్లో ధోని ఆట చూసేందుకు అతని తల్లిదండ్రులు చెన్నైలోని చేపాక్ మైదానానికి వచ్చారు. ధోని తల్లిదండ్రులతోపాటు అతని భార్య, కూతురు కూడా ఈ మ్యాచ్ చూశారు. ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడి కూతురు నోట్లో విజిల్ పెట్టుకొని ఊదడం విశేషం. అయితే ధోని తల్లిదండ్రులు మ్యాచ్ చూసేందుకు రావడంతో ప్రాధాన్య సంతరించుకుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఎందుకంటే ఈ మ్యాచ్ ద్వారా ధోని తన రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ధోని తన రిటైర్మెంట్ ప్రకటిస్తాడని.. అందువల్లే అతని తల్లిదండ్రులు వచ్చారని కొన్ని సైట్లు రాసేశాయి. క్రికెట్ విశ్లేషకులు కూడా అదే అర్థం వచ్చేలాగా తమ వ్యాఖ్యానాన్ని జోడించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని తన రిటైర్మెంట్ పై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: అనుకున్నదే జరిగింది.. చెన్నై హ్యాట్రిక్.. ఢిల్లీ టాప్.
చెన్నై కోచ్ ఏమన్నాడు అంటే..
ఐపీఎల్ లో చెన్నై జట్టుకు కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్ కొనసాగుతున్నాడు. ధోని రిటైర్మెంట్ కు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ముందు మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఫ్లెమింగ్ ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యారు.” ధోని రిటైర్మెంట్ పై నాకు ఎలాంటి సమాచారం లేదు. అసలు దీనిపై అవగాహన కూడా లేదు. ఆయనతో కలిసి గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను. ధోని శారీరకంగా చాలా దృఢత్వం కలిగి ఉన్నవాడు. మానసికంగా కూడా ఎక్కువ స్టెబిలిటీ ఉన్నవాడు. రిటైర్మెంట్ కి సంబంధించి మా మధ్య ఎటువంటి చర్చ జరగలేదు. ధోని ఇప్పట్లో రిటైర్ అవుతున్నాడని నేను అనుకోవడం లేదు. అతడు ఇంకా కొంతకాలం క్రికెట్ ఆడతాడు. అతనిలో ఆ సత్తా ఉంది. బంతి గమనాన్ని అంచనా వేయడంలో అతని తరువాతే ఎవరైనా. ప్రస్తుతం 43 సంవత్సరాల ధోని మైదానంలో చిరుతపులి లాగా ఆడుతున్నాడు. అటువంటి ఆటగాడిని రిటైర్మెంట్ గురించి అడగడం భావ్యం కాదు. ఎవరో కొంతమంది తమ వ్యూస్ కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తారు. అటువంటి వాటిని నమ్మకూడదు. ధోని తల్లిదండ్రులు మ్యాచ్ చూసేందుకు వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని ఇలాంటి గాలికబుర్లను పుట్టించి ఉండవచ్చని” ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.. అన్నట్టు ఈ మ్యాచ్లో ధోని 26 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, ఒక సిక్సర్ సహాయంతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోని మైదానంలోకి వచ్చిన దగ్గరనుంచి.. మ్యాచ్ ముగిసే వరకు అతడి నామస్మరణ కొనసాగింది. తలా తలా అంటూ చెన్నై అభిమానులు గోల చేశారు. వారిని మరింత ఉత్సాహపరిచేందుకు ధోని వేగంగా బ్యాటింగ్ చేశాడు. అంతే వేగంగా పరుగులు సాధించాడు