MS Dhoni : గడువు ముగియడానికి ఇంకా ఐదు రోజుల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా ఆటగాళ్ల జాబితాను విడుదల చేయలేదు. అయితే మొత్తంగా ఒక ఆటగాడి విషయంలో మాత్రం విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆటగాడు ఈసారి ఐపీఎల్ లో కనిపిస్తాడా? అసలు ఆడతాడా? గత సీజన్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన అతడు… ఈసారి కూడా షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడిస్తాడా? ఇలాంటి ప్రశ్నలు అభిమానుల్లో కొంతకాలం నుంచి మెదులుతున్నాయి. అయితే తాజాగా ఆటగాడు ఒక కార్యక్రమంలో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటా.. ఎస్.. అతడే మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోని కి మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరుంది. చెన్నై జట్టును అతడు ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపాడు. అయితే గత సీజన్లో చెన్నై జట్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. రుతు రాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు.. అయితే 2025 సీజన్ లో అతడు ఆడతాడా? లేదా? అనే ప్రశ్నలు అభిమానంలో ఉండేవి.. అయితే వాటికి ఇన్నాళ్లపాటు ధోని కాని, చెన్నై జట్టు కాని ఒక క్లారిటీ ఇవ్వలేదు.. అయితే ఇన్ని రోజులకు స్వయంగా ధోని రంగంలోకి దిగి.. తను వచ్చే సీజన్లో ఆడతానా? లేదా? అనే ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చాడు.
రెడీగా ఉన్నాడట?
వచ్చే సీజన్లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ధోని ప్రకటించాడు. మరో మూడు సీజన్ ల వరకు ధోని ఆటను అభిమానులు చూసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకుని ఆటగాళ్లను తక్కువలో తక్కువ మూడు సంవత్సరాల పాటు పాటించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల గోవాలో నిర్వహించిన ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రమోషన్ ఈవెంట్ లో మహేంద్ర సింగ్ ధోని పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఐపిఎల్ కు సంబంధించి విలేకరులు ప్రశ్నలు అడగగా.. ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు..” నేను క్రికెట్ ఆస్వాదిస్తాను. నేను ఆడితే జట్టుకు, వ్యక్తిగతంగా ప్రయోజనం ఉంటుంది. ఇకపై నేను ఆడే క్రికెట్ ను మరింత ఆస్వాదించాలని అనుకుంటున్నాను. ప్రొఫెషనల్ గేమ్ ఆడేవాళ్లు పాటను ఆస్వాదించలేరు. కానీ నేను అలా చేయకూడదని భావిస్తున్నాను. ఇది కష్టమైనదే అయినప్పటికీ నాకు కూడా కొన్ని కమిట్మెంట్స్, భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నిటిని ప్రస్తుతం పక్కన పెట్టి వచ్చే ఆటను మరింత గొప్పగా ఆస్వాదిస్తాను. అందుకోసమే గత తొమ్మిది నెలలుగా ఫిట్ నెస్ పై దృష్టి సారించాను. ఐపీఎల్ లో కేవలం రెండున్నర నెలలు మాత్రమే క్రికెట్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికోసం సమర్థవంతంగా ప్రణాళిక రూపొందించాలి. ఇదే సమయంలో వ్యక్తిగత జీవితానికి కూడా అవకాశం ఇవ్వాలని” ధోని పేర్కొన్నాడు..
అనామక ఆటగాడిగా..
వచ్చే సీజన్లో చెన్నై జట్టు మహేంద్రసింగ్ ధోనిని అనామక ఆటగాడిగా(అన్ క్యాప్డ్ ప్లేయర్) తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ధోనిని నాలుగు కోట్లకు చెన్నై జట్టు కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ధోని గత సీజన్లో కెప్టెన్సీ ని వదులుకోవడంతో రుతు రాజ్ గైక్వాడ్ సారధ్య బాధ్యతలు స్వీకరించాడు. అయితే అతడి ఆధ్వర్యంలో చెన్నై జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్లలేకపోయింది. గత సీజన్లో ధోని 11 మ్యాచ్ లు ఆడాడు. 224.48 స్ట్రైక్ రేట్ తో 110 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ధోని హైయెస్ట్ స్కోర్ 37* పరుగులు