Magic tricks: మ్యాజిక్ అంటే.. మాయ చేయడం కాదు.. చుట్టూ ఉన్న జనాలను సమ్మోహితులను చేయడం.. కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి..

ప్రస్తుతం స్మార్ట్ కాలంలో అన్ని ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. ఇలాంటి కాలంలో మ్యాజిక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆ మ్యాజిక్ తో చుట్టూ ఉన్న వారిని సంభ్రమాశ్చర్యంలో ముంచడం అంత సులభం కాదు. అయితే ఆఫ్రికా దేశానికి చెందిన ఓ యువకుడు అత్యంత సులువుగా మాయ చేస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 26, 2024 12:22 pm

Abukiciaga performs Best magic tricks

Follow us on

Magic tricks: చిన్నప్పుడు స్కూళ్లల్లో అప్పుడప్పుడూ మ్యాజిక్ షోలు నిర్వహించేవారు. మామూలు నీళ్లను రంగు నీళ్లు గా మార్చడం.. శూన్యం నుంచి పక్షిని సృష్టించడం.. పూల నుంచి సీతాకోకచిలుకలను ఎగిరించడం.. ఇలాంటివన్నీ ఆశ్చర్యపరిచేవి. వాస్తవానికి ఆ వయసులో ఇలాంటి మాయలు సరికొత్త అనుభూతినిచ్చేవి.

ప్రస్తుతం స్మార్ట్ కాలంలో అన్ని ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. ఇలాంటి కాలంలో మ్యాజిక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆ మ్యాజిక్ తో చుట్టూ ఉన్న వారిని సంభ్రమాశ్చర్యంలో ముంచడం అంత సులభం కాదు. అయితే ఆఫ్రికా దేశానికి చెందిన ఓ యువకుడు అత్యంత సులువుగా మాయ చేస్తున్నాడు. తన మ్యాజిక్ తో సమ్మోహితులను చేస్తున్నాడు. అతడికి రష్యన్ల మాదిరిగా ప్రత్యేక కోటు అంటూ లేదు. జాదూగర్ ఆనంద్ లాగా ప్రత్యేకమైన టోపీ లేదు. ఓ బక్క పలచని కుర్రాడు.. వదులుగా టీ షర్టు.. ఓ మామూలు ప్యాంటు.. పెద్దగా ప్రాపర్టీ కూడా లేదు. ఓ బొమ్మని తీసుకొచ్చాడు. దానికి ఏవేవో దుస్తులు ధరించాడు. చివరికి దానిని ఒక మనిషిగా మార్చాడు. చూసేవాళ్ళకు అది ఒక వింత.. దగ్గరుండి చూస్తున్న వాళ్లకు అది ఒక మాయ.. ఇక తన వెనుక ఉన్న ఒక ఫ్లెక్సీ నుంచి ఒక కోడి పుంజును బయటికి తీశాడు. దానిని అమాంతం గాల్లోకి ఎగిరించాడు.. అలా కోడిపుంజు రావడంతో చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. వారిని వారే నమ్మలేకపోయారు. ఇది మాత్రమే కాదు.. ఒక పుచ్చపండును ఎటువంటి యంత్రం వాడకుండానే రెండు ముక్కలుగా కోశాడు. అందరూ చూస్తుండగానే అందులో ఉన్న గుజ్జును అమాంతం తినేసాడు. చివరికి తినేసిన ఆ ముక్కలను తన తలకు కిరీటం లాగా ధరించాడు.

సమ్మోహితులను చేశాడు

ఆ యువకుడు చేసిన మ్యాజిక్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ యువకుడి వయసు 18 సంవత్సరాలు. అతని పేరు అబుకియాజా. స్వస్థలం ఆఫ్రికాలోని ఓ ప్రాంతం. స్థానికంగా ఉన్న ఒక కాలేజీలో చదువుకుంటున్నాడు. పెద్దగా ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం కాదు. తండ్రి ఓ సంస్థలో పనిచేస్తాడు. తల్లి చిన్నాచితకా పనులు చేస్తూ ఉంటుంది. చిన్నప్పటినుంచి అతడికి మ్యాజిక్ అంటే ఇష్టం. దానిని స్వతహాగా నేర్చుకున్నాడు. ఇందుకు యూట్యూబ్ కూడా సహకరించింది. కష్టేఫలి అన్నట్టుగా.. అతడు మ్యాజిక్కులో అంతకంతకు ఎదిగాడు. చివరికి విఖ్యాతమైన మెజీషియన్ గా రూపాంతరం చెందాడు. అమెరికాలో ఒక షో నిర్వహిస్తే వేలాదిమంది వచ్చారు. తన మాయను వారికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తే మైమరిచిపోయారు. 18 సంవత్సరాల వయసులోనే ఇంతటి స్థాయిని సంపాదించాడంటే.. మునుముందు ఎంత ఎత్తుకు ఎదుగుతాడో.. ఇంకా ఎందరి మన్ననలు పొందుతాడో.. అన్నట్టు ఆ యువకుడు చేసిన ఒక మ్యాజిక్ షో ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఏకంగా 30 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. దీనినిబట్టి అతడికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.