Diwali 2024 : హిందూ పండుగల్లో దీపావళికి ఒక ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు లక్ష్మీ దేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చెడుపై మంచి గెలిచినందుకు దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగా మొదలు అవుతుందంటే వారం రోజుల నుంచే దీపావళి సందడి ఉంటుంది. టపాసులు కాల్చుతూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగను కొన్ని పద్ధతులు పాటిస్తూ నియమ నిష్టతో పూజ చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. అయితే కొన్నిసార్లు తిథుల వల్ల పండుగ రెండు రోజులు వస్తుంది. దీంతో ఎప్పుడు జరుపుకోవాలో తెలియక కొందరు తికమక పడుతుంటారు. ఈ ఏడాది దీపావళి పండుగ విషయంలో కూడా ఇదే జరిగింది. మరి ఈ ఏడాది దీపావళి పండుగను ఏ రోజు జరుపుకోవాలి? ఎలా జరుపుకుంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు అన్ని తొలగి అన్నింట్లో విజయం సాధించాలని దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగను ప్రతీ ఏడాది కార్తీక మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కార్తీక మాసంలో అమావాస్య అక్టోబర్ 31న వచ్చింది. దీంతో పాటు నవంబర్ 1వ తేదీ వరకు కూడా అమావాస్య ఉంది. ఇలా రెండు రోజులు ఉండటంతో అసలు దీపావళి పండుగ ఎప్పుడు చేసుకోవాలని కొందరు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఈ ఏడాది దీపావళి పండుగను అక్టోబర్ 31న జరుపుకోవాలని కొందరు అంటుంటే మరికొందరు నవంబర్ 1న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమై నవంబర్ 1వ తేదీన 6:16 సాయంత్రం వరకు ఉంటుంది. ఈ అమావాస్య తిథి లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చని పండితులు అంటున్నారు. ఈ తిథి రెండు రోజులు ఉండటంతో కొందరు అక్టోబర్ 31న, మరికొందరు నవంబర్ 1న జరుపుకుంటున్నారు.
దీపావళి పండుగను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ జరుపుకుంటారు. అయితే ఈ పండుగను సాయంత్రం పూట చేస్తారు. కానీ తెల్లవారు జామున లేచి కాల కృత్యాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని కొత్త దుస్తులు ధరించాలి. ఇంట్లో దీపం వెలిగించి సాయంత్రం పూజకి కావాల్సిన వంటలు తయారు చేయాలి. ఎక్కువ మంది దీపావళి పండుగ రోజు లక్ష్మీ దేవికి ఇష్టమైన తీపి వంటకాలు చేస్తుంటారు. సాయంత్రం పిండి వంటలు, స్వీట్లుతో లక్ష్మీదేవిని పూజిస్తే తల్లి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ నియమాలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.