Devadath padikkal : ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో బెంగళూరు జట్టు నాలుగు మ్యాచ్లు ఆడింది.. కోల్ కతా, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లతో తలపడింది. ఇందులో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓటమిపాలైంది. మిగతా మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇటీవల ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఉత్కంఠ పరిస్థితిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. బెంగళూరు దేవదత్ పడిక్కల్ కూడా తన వంతు మెరుపులు మెరిపించాడు. అతడు కూడా వేగంగా రన్స్ చేసి అదరగొట్టాడు. మొత్తంగా బెంగళూరు వరుస విజయాలతో అటు అభిమానులను ఆనందంలో ముంచుతుండగా.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ దక్కించుకోవాలని తలంపు ఆటగాళ్లలో ఉంది.
Also Read : విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..
అందరికీ భాయ్!
విరాట్ కోహ్లీ కి సీజన్లో బెంగళూరు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. బెంగళూరు యాజమాన్యం కూడా అదే విధంగా సంకేతాలు ఇచ్చింది. కాని చివరికి బెంగళూరు జట్టు కెప్టెన్ గా రజత్ పాటిదార్ బాధ్యతలు స్వీకరించాడు. అతని ఆధ్వర్యంలో బెంగళూరు జట్టు తొలి మ్యాచ్లోనే డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ను మట్టి కరిపించింది. ఆ మ్యాచ్ నుంచి గుజరాత్ మినహా మిగతా అన్నింటిలోనూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. అయితే ఈ విజయాలకు కారణం ఏంటి అని దేవదత్ పడిక్కల్ ను మీడియా ప్రతినిధులు అడిగితే..” బెంగళూరు జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ మాకు మార్గదర్శకం చేస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో బెంగళూరు జట్టు ప్రస్తుతం ఐపీఎల్ లో స్థిరమైన ప్రదర్శన చేస్తోంది. మా ఆధ్వర్యంలో బెంగళూరు జట్టు గెలుస్తోంది అనేకంటే.. విరాట్ కోహ్లీ మార్గదర్శకంలో బెంగళూరు జట్టు వరుస విజయాలు సాధిస్తుందనడం సబబు. విరాట్ కోహ్లీ సీనియర్ ఆటగాడు.. ఎంతో అనుభవం ఉన్న కెప్టెన్. అతడి ఆధ్వర్యంలో బెంగళూరు జట్టు గతంలో ఎన్నో విజయాలు సాధించింది.. విరాట్ కోహ్లీ మా అభిమాన ఆటగాడు. దేవదత్ పడిక్కల్ బెంగళూరు జట్టుకు కెప్టెన్. కానీ విరాట్ మా అందరికీ భాయ్ లాంటివాడని” రజత్ పాటిదార్ వ్యాఖ్యానించాడు.
Also Read : జస్ ప్రీత్ బుమ్రా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వాంఖడే ఊగిపోయిందిగా..