Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న హీరో కూడా తనే కావడం విశేషం. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఆయన తన లుక్ మార్చడం వెనక కారణం ఏంటి అంటే ఆయన ఇక మీదట ఓజీ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా? లేదా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో తీర్చి దిద్దబోతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్ని మంచి విజయాలను సాధించాయి. ఇక ఓజీ సినిమాతో ఆయన అభిమానులకు ఏం కావాలో అది ఇవ్వడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : పెద్ద కొడుకు పుట్టినరోజున చిన్న కొడుక్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది – పవన్ కళ్యాణ్
ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది…కంప్లీట్ గ్యాంగ్ స్టర్ నేపధ్యం లో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే ఎవ్వరికి సాధ్యం కానీ గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు…
ఒక్కసారి ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఆయనకి తిరుగుండదనే చెప్పాలి. సెట్స్ మీద ఉంచిన సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఆయన ఇంకా సినిమాలను చేస్తాడా లేదంటే సినిమాలకు స్వస్తి చెప్పి ఫుల్ టైమ్ పాలిటిక్స్ మీదనే తన దృష్టిని కేంద్రీకరిస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఒక వేళ ఆయన సినిమాలకు గుడ్ బై చెబితే మాత్రం ఆయన అభిమానులు ఆయన్ని చాలా వరకు మిస్ అయిపోతారు…వాళ్ళను అలరించడానికైనా అడపాదడపా సినిమాలను చేస్తే బాగుంటుందని మరికొంత మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రీల్ హీరో కాదు రియల్ హీరో.. గిరిజనుల మదిని దోచిన పవన్ కళ్యాణ్!