Jaspreet Bumrah : బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. భీకరమైన ఫామ్ లో ఉన్న సాల్ట్ ( Salt) బౌల్ట్ విసిరిన రెండవ బంతికే అవుట్ అయ్యాడు. బౌల్ట్ విసిరిన తొలి బంతికి ఫోర్ కొట్టిన సాల్ట్.. రెండవ బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సాల్ట్ అవుట్ అయిన తర్వాత దేవదత్ పడిక్కల్ (Devadath padikkal) క్రీజ్ లోకి వచ్చాడు. ఈ కథనం రాసే సమయానికి విరాట్ కోహ్లీ (Virat Kohli)(10), దేవదత్ పడిక్కల్(Devadath padikkal)(11) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరు జట్టు ఒక వికెట్ నష్టానికి 2.4 ఓవర్లలో 25 పరుగులు చేసింది.
Also Read :శ్రేయస్ అయ్యర్ భారత్ కు ఉత్తమ కెప్టెన్ కాగలడు..రికీ పాంటింగ్
మైదానం ఊగిపోయింది
సుదీర్ఘకాలం నేషనల్ క్రికెట్ అకాడమీకి పరిమితమైపోయిన ముంబై ఇండియన్స్ ఏస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లోకి రంగ ప్రవేశం చేశాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ముంబై జట్టు నాలుగు మ్యాచ్లు ఆడింది. ఈ నాలుగు మ్యాచ్లలో చెన్నై, గుజరాత్, కోల్ కతా, లక్నో జట్లతో తలపడింది. కోల్ కతా జట్టు తో జరిగిన మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. ఇక సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్ అత్యంత ముఖ్యంగా మారింది. ఇందులో కచ్చితంగా ముంబై విజయం సాధించాల్సి ఉంది. అయితే ముంబై జట్టులోకి బుమ్రా ప్రవేశించడంతో కొండంత బలంగా మారింది. అతడు మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. బుమ్రా బుమ్రా.. అనే నినాదాలతో హోరెత్తిపోయింది. అయితే ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి ఓవర్ బుమ్రా తో వేయిస్తాడని అందరు అనుకున్నారు. కాకపోతే తొలి ఓవర్ బౌల్ట్ వేశాడు. రెండవ ఓవర్ దీపక్ చాహర్ వేశాడు. నాలుగో ఓవర్ వేసే బాధ్యతను బుమ్రా కు హార్థిక్ పాండ్యా అప్పగించాడు. నాలుగో ఓవర్ లో తొలి బంతి కి దేవదత్ పడిక్కల్ ఒక పరుగు తీశాడు. రెండవ బంతికి విరాట్ కోహ్లీ భారీ సిక్సర్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవర్ లో బుమ్రా పది పరుగులు ఇచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ, బుమ్రా ఇప్పటివరకు 16 ఇన్నింగ్స్ లలో పరస్పరం తలపడ్డారు. బుమ్రా బౌలింగ్లో విరాట్ కోహ్లీ 95 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 147.36 గా ఉంది. యావరేజ్ 28. విరాట్ ను బుమ్రా ఐదుసార్లు అవుట్ చేశాడు.
Virat Kohli hits Jasprit Bumrah for a SIX!
It’s all happening at Wankhede! #MIvRCB pic.twitter.com/VADDzw5Sfw
— Sameer Allana (@HitmanCricket) April 7, 2025