https://oktelugu.com/

David Warner: ఉచిత ఆధార్‌ కోసం వార్నర్‌ పరుగులు.. వీడియో వైరల్‌!

దేశరాజధానిలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఈ ఢిల్లీ ఓపెనర్‌తో హోస్ట్‌ కొంతసేపు మాట్లాడారు. సినిమాకు వెళ్దామా అని అడుగగా వార్నర్‌ రాలేనని చెప్పాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 24, 2024 / 02:50 PM IST

    David Warner

    Follow us on

    David Warner: ఆస్ట్రేలియా స్టార బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు భారత్‌ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన భారతీయ సినిమాలు చూస్తారు. భాషా భేదం లేకుండా సినిమా పాటలను ఎంజాయ్‌ చేస్తారు. రీల్స్‌ చేస్తారు. కుటుంబంతో కూడా రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తాడు. ఆయన వీడియోలు భారతీయులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా మార్నర్‌ మరో వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇందులో అతను ఉచిత ఆధార్‌ తీసుకునేందుకు పరిగెత్తడం నవ్వులు పూయిస్తోంది.

    ఏం జరిగింది..
    దేశరాజధానిలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఈ ఢిల్లీ ఓపెనర్‌తో హోస్ట్‌ కొంతసేపు మాట్లాడారు. సినిమాకు వెళ్దామా అని అడుగగా వార్నర్‌ రాలేనని చెప్పాడు. ఫ్రీ భోజనం అని చెప్పినా కూడా వద్దన్నాడు. చివరకు అక్కడ ఆధార్‌ కార్డు ఉచితంగా ఇస్తున్నారు అని చెప్పగానే చలో.. చలో అంటూ హోస్ట్‌ను ఎత్తుకుని పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది. హోస్ట్‌ అడిగిన ప్రశ్నలకు వార్నర్‌ హిందీలోనే సమాధానం చెప్పడం మరో విశేషం. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రాంలో వైరల్‌ అవుతోంది.

    నేడు గుజరాత్‌ – ఢిల్లీ మ్యాచ్‌..
    ఇదిలా ఉండగా నేడు ఐపీఎల్‌లో గుజరాత్‌తో ఢిల్లీ తలపడనుంది. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు వార్నర్‌ దూరమయ్యాడు. నేటి మ్యాచ్‌కూ అతడు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ హైదరాబాద్‌ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ 8వ స్థానంలో ఉంది.