https://oktelugu.com/

Tea: ఛాయ్ తో పాటు వీటిని తింటున్నారా? అయితే అంతే సంగతులు

శనగ పిండి పదార్థాలు.. మిర్చి ఛాయ్, పకోడీలు ఛాయ్ కాంబినేషన్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ టీతో పాటు వీటిని తినకూడదు అంటారు నిపుణులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 24, 2024 / 02:42 PM IST

    Tea

    Follow us on

    Tea: వాహ్ ఛాయ్..ఛాయ్ పేరు వింటేనే హుషారు అనిపిస్తుంటుంది. మరి ఛాయ్ అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారు. కానీ ఛాయ్ తోని కొన్ని పదార్థాలను అసలు తినకూడదు. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకోండి. మీరు కూడా వాటిని ఛాయ్ తోని స్కిప్ చేయండి.

    శనగ పిండి పదార్థాలు.. మిర్చి ఛాయ్, పకోడీలు ఛాయ్ కాంబినేషన్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ టీతో పాటు వీటిని తినకూడదు అంటారు నిపుణులు. ఎందుకంటే శనగపిండితో చేసిన ఆహారాలు డైజెస్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. చిప్స్ లో ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి టీ తో పాటు చిప్స్ ను తినకండి. మెటబాలిజం నెమ్మదించి అజీర్తి సమస్యలు వస్తాయి. పెరుగు, పసుపుతో చేసిన పదార్థాలను కూడా టీ తో పాటు తినకూడదు.

    కేకులు, డోనట్స్ వంటి తీపి పదార్థాలను కూడా టీ తో పాటు తింటారు కొందరు. ఈ కాంబో వల్ల చక్కెర స్థాయిని మరింత పెరుగుతుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. మరింత ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. టీలో ఆక్సటేట్లు, టానిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి కాబట్టి శరీరంలోని శోషణను అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఆకుకూరల్లో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఆకుకూరలతో చేసిన స్నాక్స్ ను టీతో పాటు వీటిని తింటే శరీరానికి ఐరన్ అందదు.

    ఫ్రూట్ సలాడ్ లో చాలా పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ లు ఉంటాయి. కానీ టీ తాగుతున్నప్పుడు ఈ సలాడ్ ను అసలు తినకూడదు. టీలోని టానిన్స్ అనే కెమికల్ కాంపౌండ్ పండ్లలోని పోషకాలను ఒంటబట్టకుండా అడ్డుకుంటుంది. సోడాలు, కోలాలు వంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ టీ తో పాటు ఈ డ్రింక్స్ ను తాగకూడదు. కార్బోనేటెడ్ డ్రింక్స్ లో ఉండే ఆమ్లాలు టీ రుచిని పాడు చేస్తాయి కాబట్టి ఆరోగ్యానికి హానికరం అవుతుంది అని గుర్తు పెట్టుకోండి.