Nighties: నైటీలు వేసుకునే మహిళలందరికీ ఇది హెచ్చరిక

రాత్రి మాత్రమే కాదు పగలు కూడా కొందరు నైటీలు వేసుకుంటారు. ఎండ తాపం నుంచి తట్టుకోవడం కోసం నైటీలు వేసుకుంటున్నారు మహిళలు.

Written By: Swathi, Updated On : April 24, 2024 3:01 pm

Nighties

Follow us on

Nighties: వేసవి వచ్చిందంటే చాలు ఎండకు ఎండాల్సిందే. వేడిని భరించాల్సిందే. ఏసీలు, చల్లటి నీరు కావాల్సిందే. ఫ్యాన్లు, కూలర్లు ఉండాల్సిందే. మరి ఇక్కడితోనే సరిపోతుందా? బట్టలు కూడా చాలా చల్లగా ఉండాల్సిందే. లేదంటే ఎండకాలాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఇక మగవారు షాట్లు, ఆడవారు నైటీలు వేసుకోవడం ఈ కాలంలో కామన్ గా మారింది. మరి ఈ నైటీలు వేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉందో తెలుసా? ఓ సారి ఈ నైటీల గురించి తెలుసుకుందాం.

రాత్రి మాత్రమే కాదు పగలు కూడా కొందరు నైటీలు వేసుకుంటారు. ఎండ తాపం నుంచి తట్టుకోవడం కోసం నైటీలు వేసుకుంటున్నారు మహిళలు. ఒకప్పుడు రాత్రి సమయంలో నిద్ర పట్టడానికి నైటీలు వేసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం డే టైమ్ లో కూడా వేసుకుంటున్నారు. పండుగలకు కూడా పట్టుచీరలను పక్కకు పెట్టి నైటీలనే వేసుకుంటున్నారు. ఉదయం స్నానం చేసిన తర్వాత నైటీలు వేసుకోని ఇల్లంతా తిరుగుతారు. మొత్తం మీద నైటీలకు మహిళలు మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొందరు కాటన్ నైటీలు మాత్రమే కాదు పాలిస్టర్ నైటీలను కూడా వేసుకుంటున్నారు. ఇలా ఈ నైటీలను వేసుకొని చెమట వచ్చినా, పని చేసినా కూడా నైటీలకే తుడుస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే క్రీములు శరీరంలోకి వెళ్తాయి. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అయితే పాలిస్టర్ నైటీలకు క్రీములు ఎక్కువగా అవుతాయట. అందుకే కాటన్ నైటీలను వేసుకోవాలి అంటారు

చెమటల వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందట. ఎప్పటికప్పుడు ఉతికిన బట్టలను మాత్రమే వేసుకోవాలి. లేదంటే క్రీములు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందట. అందుకే బట్టలతో నైటీలతో కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది.