T20 Viral Moment: టి20 ఫార్మాట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రికెట్ అనేది సమూలంగా మారిపోయింది. వేగమే కొలమానంగా మారిపోయింది. దూకుడే పర్యాయపదంగా మారింది. దీంతో ఆటగాళ్లు ఆకాశమేహద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా టి20 ఫార్మేట్ లో యువతకు ఎక్కువగా అవకాశాలు రావడంతో పరుగుల వరద అనేది సర్వసాధారణంగా మారిపోతుంది.. టి20కి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో అనేక కౌంటి మ్యాచ్ లు జరుగుతున్నాయి. క్రికెట్ క్లబ్ లు కూడా టీ 20 ఫార్మాట్లో టోర్నీలు నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నీలలో ప్రఖ్యాతమైన పేరు ఉన్న ఆటగాళ్లు పాల్గొంటున్నారు. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు వస్తుండడంతో .. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.
Also Read: Test Match England Win: ఇండియా బౌన్స్ బ్యాక్ అవుతుందా..?
తాజాగా విదేశాలలో జరుగుతున్న ఓ టి20 క్రికెట్ టోర్నీలో అద్భుతం చోటుచేసుకుంది.. ల్యూక్ హోల్ మన్ అనే ఆటగాడు ఎవరికీ సాధ్యం కాని షాట్ ఆడాడు. సామ్ కరణ్ అనే బౌలర్ బౌలింగ్ లో బంతిని కసి తీరా కొట్టాడు. తీరా చూస్తే ఆ బంతి ఎక్కడ బౌండరీ లైన్ అవతల పడింది.. దీంతో బౌలర్ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇదేం కొట్టుడు రా బాబు అనుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.. ఎడమచేతి వాటం గల హోల్ మన్ సామ్ కరణ్ వేసిన బంతిని ముందుగా స్వీప్ షాట్ ఆడదామని ప్రయత్నించాడు. కానీ ఆ బంతి ఫుల్ టాస్ రావడంతో.. ఒక్కసారిగా రెండు అడుగులు వెనక్కి వేసి బ్యాట్ ను తిప్పి గట్టిగా కొట్టాడు. దీంతో బంతి రయ్యిమంటూ గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత బౌండరీ లైన్ దాటింది.
Also Read: Australia Test Victory: ఎలాంటి వెస్టిండీస్ ఎలా అయిపోయింది.. మరీ దారుణంగా 27 పరుగులకా..
వాస్తవానికి క్రికెట్లో ఈతరహా షాట్లు ఇటీవల కాలంలో ఏ ఆటగాడు కూడా ఆడలేదు. టి20 అనేది వేగానికి కొలమానమే. దూకుడుకు పర్యాయపదమే. కానీ ఒక ఆటగాడు ఇలా తన బ్యాట్ గమనాన్ని పూర్తిగా మార్చేసి.. బంతి తీరును బట్టి అప్పటికప్పుడు తన తీరు మార్చేసి ఇలా కొట్టడం మాత్రం కొత్తగానే ఉంది. బహుశా ఇటువంటి షాట్ కొట్టాలంటే మిగతా బ్యాటర్లు ఆలోచించాల్సిందే. ఇప్పుడు హోల్ మన్ కొట్టిన షాట్ సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది. ” పెద్ది సినిమాలో.. లగాన్ సినిమాను చూసి స్ఫూర్తిని పొందినట్టున్నాడు. అందువల్ల ఇలా ఆడాడు. పైగా అతడు కొట్టిన షాట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా పెద్ది సినిమాలోది వాడుతున్నారు. ఆ ఆటగాడితో పాటు ఆ సినిమాకు కూడా ప్రచారం లభిస్తోంది. నిజంగా బ్యాటర్లు ఇలా బ్యాటింగ్ చేస్తే బౌలర్లు బౌలింగ్ వేయడం మానేస్తారు. అంతటి కఠినమైన బంతిని కూడా సిక్స్ కొట్టి శిక్షిస్తే.. ఇక బౌలింగ్ ఎలా వేస్తారు.. ఎక్కడ వేస్తారు.. వేసినా ఉపయోగం ఏముంటుందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
NEW SHOT INVENTION.
– What would you name it? pic.twitter.com/VO7jT08rgL
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2025