Puri Jagannadh and Rajamouli connection: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్ (Puri Jagannadh)…ఆయన ఒకప్పుడు చేసిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఒకానొక సందర్భంలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కూడా మారాడు. మరి ఇలాంటి పూరి జగన్నాథ్ చాలా ఫాస్ట్ గా సినిమాలను చేస్తూ ఉంటాడు… ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాథ్ తో పాటు రాజమౌళి కూడా భారీ సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక బిజినెస్ మెన్ సినిమా ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి స్టేజ్ మీదనే పూరి జగన్నాథ్ గారు మీరు ఎలా ఇంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు. నేను మీ దగ్గర కొద్దిరోజులు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తాను. నాకు కూడా మెలకువలు నేర్పించండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించాయి…అంటే పూరి చాలా తక్కువ రోజుల్లో సినిమాని ఎలా చేయగలరో తెలుసుకోవడానికి మాత్రమే రాజమౌళి ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేస్తానని చెప్పాడు. ఎందుకంటే రాజమౌళి సినిమాలు దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాయి.
Also Read: రాజమౌళి – మహేష్ బాబు డూప్ ను వాడకపోవడానికి కారణం అదేనా..?
అందుకే తన భార్య అయిన రమా గారు రాజమౌళితో పూరి జగన్నాథ్ ని చూసి నేర్చుకోండి తక్కువ సమయం లో సినిమా చేసి ఎలా బ్లాక్ బస్టర్ ని సాధించాలో అంటూ ఆమె అనడంతో రాజమౌళి అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పాడు. మరి మొత్తానికైతే ఇదంతా ఒక ఫన్నీ కన్వర్జేషన్ అయినప్పటికి అప్పట్లో పూరి జగన్నాథ్ అభిమానులకు ఇదొక మంచి న్యూస్ అనే చెప్పాలి.
వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని పండగ చేసుకున్నారు… ప్రస్తుతం పూరి జగన్నాథ్ కొంతవరకు డోన్ ఫాల్లో ఉన్నప్పటికి రాజమౌళి మాత్రం ప్రపంచ సినిమా స్థాయికి వెళ్లిపోయాడు. మహేష్ బాబు(Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో ప్రపంచ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: శ్రీకాంత్ ఓదెల సినిమాను చిరంజీవి పక్కనపెట్టడా..?
మరి హాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటికే మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో మన సినిమాలను వాళ్ళు ఎలా ఆదరిస్తారు. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…కానీ రాజమౌళి మాత్రం వాళ్ళని కూడా మెస్మరైజ్ చేసే సినిమాలు చేస్తాడు అంటు మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…