Homeక్రీడలుక్రికెట్‌South Africa Crushes Australia: ఇండియాకు సాధ్యం కానిది.. సౌతాఫ్రికన్లు చేసి చూపించారు.. ఎలా సాధ్యమైందంటే?

South Africa Crushes Australia: ఇండియాకు సాధ్యం కానిది.. సౌతాఫ్రికన్లు చేసి చూపించారు.. ఎలా సాధ్యమైందంటే?

South Africa Crushes Australia: నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ నాలుగు రోజుల్లో ముగిసినప్పటికీ.. తీవ్రమైన ఒత్తిడిని సైతం జయించి సఫారీ జట్టు విజయాన్ని అందుకుంది. టెస్ట్ గద సొంతం చేసుకుంది. వాస్తవానికి బలమైన కంగారు జట్టును ఓడిస్తుందని.. టెస్ట్ గద సొంతం చేసుకుంటుందని సఫారీ జట్టు మీద ఎవరికి ఏమాత్రం అంచనాలు లేవు. ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో కంగారు జట్టు 212 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత సఫారి జట్టు 138 వద్ద ఆల్ అవుట్ అయింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కంగారు జట్టు 207 రన్స్ స్కోర్ చేసింది. మొత్తంగా సఫారి జట్టు ఎదుట 282 రన్స్ టార్గెట్ విధించింది. తొలి ఇన్నింగ్స్ లో 138 రన్స్ కు కుప్పకూలిన నేపథ్యంలో.. సఫారి జట్టు 282 రన్స్ స్కోర్ బ్రేక్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. దీంతో కంగారు జట్టులో విపరీతమైన ఆత్మవిశ్వాసం కనిపించింది. త్వరగానే సఫారీ జట్టును ప్యాకప్ చేస్తామనే భావన వారిలో దర్శనమిచ్చింది. అంతేకాదు పది పరుగులు చేయకుండానే సఫారి జట్టు తొలి వికెట్ కోల్పోవడంతో.. తీవ్రమైన ఒత్తిడి ఆ జట్టు మీద కనిపించింది. ఈ దశలో రెండవ వికెట్, మూడో వికెట్ భాగస్వామ్యాలు సఫారి జట్టును తిరుగులేని స్థాయిలో నిలబెట్టాయి. తద్వారా విజయం సాధించేలా చేశాయి.

Also Read: WTC Final 2025 Winner: లార్డ్స్ లో కంగారుల పని ఖతం.. టెస్ట్ గద దక్షిణాఫ్రికా సొంతం .. చివర్లో ఎన్ని మలుపులంటే..

ఇండియాకు సాధ్యం కానిది..
గత రెండు సీజన్లో భారత జట్టు సుదీర్ఘ ఫార్మాట్లో తుది పోరు వరకు వెళ్లిపోయింది. తుది పోరులో ఒకసారి కివిస్ చేతిలో ఓటమిపాలైంది. రెండవసారి కంగారుల చేతిలో పరాభవానికి గురైంది. కివీస్ చేతిలో 8 వికెట్లు.. కంగారుల చేతిలో 209 పరుగుల తేడాతో ఓటములు ఎదుర్కొంది. వాస్తవానికి భారత జట్టులో ఉన్న ఆటగాళ్ల ప్రకారం చూసుకుంటే అసలు ఓడిపోవడానికి ఆస్కారమే లేదు. కానీ తుది పోరులో తీవ్రమైన ఒత్తిడికి గురై భారత ప్లేయర్లు ప్రత్యర్థి బౌలర్ల ఎదుట తలవంచారు. తద్వారా ఓటమిపాలయ్యారు. సుదీర్ఘ ఫార్మాట్లో ఆటగాళ్లకు ఓర్పు ఉండాలి. సహనం ఉండాలి. తొందరపాటు వల్ల ప్రయోజనం ఉండదు. సుదీర్ఘ ఫార్మాట్లో ఆటగాళ్లు ఎంత ఓపికతో ఉంటే ఫలితం అంత బాగుంటుంది. అదే విషయాన్ని సఫారీ జట్టు ప్లేయర్లు నిరూపించారు.. ముఖ్యంగా వికెట్లు పడుతుంటే సఫారి జట్టు సారథి నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ మార్క్రం సమయనంతో బ్యాటింగ్ చేశాడు. బలమైన కంగారు బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

Also Read: WTC Final 2023 India Vs Australia: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ విజేత ప్రైజ్ మనీ ఎంతంటే..?

వీరిద్దరూ పెద్ద ఓపికతో ఆడటం వల్లే కంగారు జట్టు మానసికంగా పై చేయి సాధించలేకపోయింది. ముఖ్యంగా మూడో రోజు రెండు వికెట్లు పడినప్పటికీ.. మార్క్రం, సఫారీ కెప్టెన్ కంగారు బౌలర్లను అత్యంత చాకచక్యంగా కాచుకున్నారు.. ఇదే మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. వాస్తవానికి గత రెండు సీజన్లలో భారత ప్లేయర్లు విస్మరించింది ఇదే. వారు దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లను పడేసుకోవడం వల్ల మ్యాచ్ లు చేజారాయి. బౌలింగ్ లో కూడా సమర్థవంతమైన ప్రతిభ చూపించకపోవడంతో ప్రత్యర్థి బ్యాటర్లు పండగ చేసుకున్నారు. పరుగుల వరద పారించారు. ప్రత్యర్థి బౌలర్లు పదేపదే కవ్వించే బంతులు వేయడంతో.. వాటికి భారత బ్యాటర్లు రెచ్చిపోయి మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికైనా కూడా లార్డ్స్ మైదానంలో సఫారి జట్టు ప్లేయర్లు ఆడిన తీరును జాగ్రత్తగా పరిశీలించి సమర్థవంతంగా ఆడితే.. వచ్చే సీజన్లో గిల్ సేనకు తిరుగుండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular