Kannappa Trailer Review : మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ నిర్మించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు ఈ సినిమా తన కెరీర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుందని బలమైన నమ్మకాన్ని ఈ సినిమా ప్రొమోషన్స్ లో తెలియజేశాడు. మంచు విష్ణు మాటలు ఎప్పుడూ ఇలానే అతిశయోక్తి గా ఉంటాయి కదా, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎంతో మంది నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. రెండు టీజర్స్ వదిలారు, అవి ఏమాత్రం ఆడియన్స్ ని ఆకర్షించలేదు. కానీ పాటలు మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆడియన్స్ కి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.
సినిమాలో ఏమి ఉండదులే అని అనుకున్న వారికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ట్రైలర్ ప్రారంభం నుండి ఎండింగ్ వరకు క్వాలిటీ అదిరిపోయింది. అదే విధంగా సినిమాలో మంచి డెప్త్ ఉందని కూడా ఈ ట్రైలర్ తో స్పష్టంగా తెలిసింది. అక్షయ్ కుమార్(Akshay Kumar) శివుడిగా బాగా సూట్ అయ్యాడు. కానీ ఆయనకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతు మాత్రం కాస్త నిరాశపర్చింది. బాలీవుడ్ హీరో తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో, అలా ఉంది. శివుడి క్యారక్టర్ చేస్తున్నప్పుడు స్వరం కూడా గంభీరంగా ఉండాలి కదా?, డైరెక్టర్ ఎందుకు ఇది విశ్వాయించాడు? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. కానీ ప్రభాస్(Rebel Star Prabhas) ఎంట్రీ మాత్రం ఆయన అభిమానులకు గూస్ బంప్స్ రప్పించాయి. నాస్తికుడు అయిన కన్నప్ప కు శివుడి పై భక్తి కలిగించే పాత్రలో ఇందులో ప్రభాస్ కనిపించినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్లందరికంటే నేనే పెద్దవాడిని అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.
ట్రైలర్ చివర్లో ప్రభాస్ మరియు మంచు విష్ణు కి మధ్య చిన్న పోరాట సన్నివేశం ఉన్నట్టు చూపించారు. ఓవరాల్ గా ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మకాన్ని ట్రైలర్ కల్పించింది. ప్రభాస్ అభిమానులను సంతృప్తి పరిచే సన్నివేశాలు ఈ చిత్రం లో మెండుగానే ఉన్నాయి. కాబట్టి ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల కరువు మామూలు రేంజ్ లో లేదు. ఆడియన్స్ ఒక్క సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆకలిని తీర్చే విధంగా ఈ చిత్రం అయితే రెడీ అయ్యింది. ఇక బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి.