WTC Final 2025 Winner: 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత మరోసారి ఐసీసీ నిర్వహించిన ఏ మేజర్ టోర్నీ కూడా గెలవలేకపోయింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకుంది. వాస్తవానికి గత రెండు సీజన్లో దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్ ఫార్మాట్ ఏమంత గొప్పగా సాగలేదు. కానీ ఈ సీజన్లో మాత్రం అద్భుతం అనే రేంజ్ లో ఆడింది దక్షిణాఫ్రికా. వరుసగా విజయాలు సాధిస్తూ.. డబ్ల్యూటీసి తుది పోరుకు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా కంటే ముందు తన బెర్త్ సిద్ధం చేసుకుంది. చివరికి కంగారు జట్టును లార్డ్స్ వేదికగా పడుకోబెట్టి.. టెస్ట్ గదను సొంతం చేసుకుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన తుది పోరులో ప్రోటీస్ జట్టు కంగారు ల ముందు ఏమాత్రం తలవంచలేదు. ఒత్తిడికి గురి కాలేదు. తొలి ఇన్నింగ్స్ లో కాస్త వెనుకబడినప్పటికీ.. బౌలింగ్ ద్వారా ఆ లోటును భర్తీ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో రికెల్టన్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ముల్డర్(27), ఎయిడెన్ (136), టెంబా(66) మూడో వికెట్ కు 147 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యమే దక్షిణాఫ్రికా జట్టు విజయానికి కారణమైంది.. కంగారు బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. వీరిద్దరూ అడ్డుగోడ లాగా నిలబడ్డారు. మూడోరోజు ఆటలో దక్షిణాఫ్రికా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది అంటే.. వీరిద్దరూ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడటమే.. ఆ తర్వాత నాలుగో రోజు ప్రోటీస్ కెప్టెన్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. ఎయిడెన్ గట్టిగా నిలబడ్డాడు..స్టబ్స్(8) నిరాశపరచినప్పటికీ.. బెడింగ్ హం అదరగొట్టాడు. ఎయి డెన్ అవుట్ అయినప్పటికీ.. వెర్రినే, బెడింగ్ హం చివరి లాంచనాన్ని పూర్తి చేశారు.
SOUTH AFRICA HAVE WON AN ICC TITLE AFTER 27 YEARS.
– Temba Bavuma and his boys create history at the Lord’s in WTC Final.
Congratulations pic.twitter.com/zPTho0Lvxk
— நெல்லை செல்வின் (@nellaiselvin87) June 14, 2025
ఇక ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచినప్పటికీ.. బ్యాటింగ్ ఎంచుకోకుండా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో కమిన్స్ జట్టు 212 పరుగులు చేసింది.. రబాడ ఐదు వికెట్ల పడగొట్టాడు. జాన్సన్ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు.. ఇక దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. కమిన్స్ ఆరు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక కంగారు జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో 207 పరుగులు చేసింది.. రబడ నాలుగు వికెట్లు, ఎంగిడి మూడు వికెట్లు సాధించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 282 పరుగులు చేసింది. స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు.. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో.. దక్షిణాఫ్రికా ఒత్తిడిని జయించి విజయాన్ని సొంతం చేసుకుంది.. గెలిచిన తర్వాత లార్డ్స్ మైదానంలో సంబరాలు అంబరాన్ని తాకాయి.. దక్షిణాఫ్రికా ప్లేయర్లు కన్నీటి పర్యంతమవుతు.. ప్రేక్షకులకు అభివాదం చేశారు.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్లు స్మిత్, డివిలియర్స్ సంబరాలలో భాగస్వాములయ్యారు.