How many jobs will be lost with AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనుషుల అవసరం ఎక్కువగా లేకుండానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. తద్వారా చాలా రంగాలలో ఉపాధి అవకాశాలను ఉద్యోగులు కోల్పోతున్నారు. ఎలాగూ ఉద్యోగులతో అవసరం లేదు కాబట్టి కంపెనీలు కూడా వారిని మెడపట్టి బయటికి గెంటేస్తున్నాయి. తద్వారా కంపెనీలకు ఆర్థికంగా వెసలుబాటు కలుగుతోంది. భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పోతోంది. కృత్రిమ మేధస్సు వల్ల చోటుచేసుకునే మార్పులపై గోల్డ్ మాన్ సాచ్స్ ఒక నివేదిక వెల్లడించింది. ఆ నివేదికలో సంచలన విషయాలను పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.. అనేక విభాగాలలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ చొచ్చుకు రావడం వల్ల లక్షల పదిమంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. ఆ నివేదిక ప్రకారం దాదాపు 300 మిలియన్ల మంది ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు.
ఏఏ విభాగాలలో ఉద్యోగాల కోత అంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల డాటా ఎంట్రీ, షెడ్యూలింగ్, ట్రాన్స్ కిప్షన్ వంటి అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ విభాగాలలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో పనిచేయించడం వల్ల.. ఇందులో పని చేసేవారు తమ ఉద్యోగాలను కోల్పోతారు.. ఆ తర్వాత కస్టమర్ సర్వీస్ విభాగంలో పనులను కృత్రిమ మేథ ఆధారంగా పనిచేసే చాట్ బాట్ ద్వారా పూర్తి చేస్తారు..
రిటైల్ రంగంలో క్యాషియర్లు, స్టాక్ మేనేజర్లు, స్వీయ చెక్ అవుట్ పరిశీలన, స్మార్ట్ ఇన్వెంటరీ సిస్టం లో పనిచేసేవారికి ఉపాధి అవకాశాలు మృగ్యమవుతాయి. తయారీ, లాజిస్టిక్స్, సెల్ఫ్ డెలివరీ వంటివి భాగాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటాయి. కాపీ రైటింగ్, టెంప్లెట్ చేసే నివేదికలు, ప్రైమరీ కంటెంట్ డెవలప్మెంట్ వంటి విభాగాలలో పనిచేసే వారు కూడా ఉపాధి అవకాశాలను కోల్పోతారు. ఈ విభాగాలలో మనుషులు చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేపడతారు.
2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం పనిగంటలు ఆటోమేటెడ్ అవుతాయని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివరి నాటికి ఆటోమేషన్ 85 మిలియన్ల ప్రజల ఉద్యోగాలను తొలగిస్తుందని.. అదే సమయంలో 97 మిలియన్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం భావిస్తుంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్లు, డాటా సైంటిస్టులు, వంటివారు కీలకంగా కాబోతున్నారు. వీరంతా కూడా కృత్రిమ మేథ సాధనాలలో నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్ ను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరకంగా మిగతా వి భాగాలలో పని చేసేవారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై నైపుణ్యాన్ని పెంచుకొని.. దానిపై పట్టు సాధిస్తే భవిష్యత్తు ఆనందకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.