Rishabh Pant Century Celebration: టీమిండియా(team India) టెస్ట్ విభాగం వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh pant) ప్రస్తుతం భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొట్టాడు. ఇంగ్లీష్ గడ్డమీద తనకు తిరుగులేదని మరొకసారి నిరూపించుకున్నాడు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డాడు. ఎడమచేత్తో బ్యాటింగ్ చేస్తూ.. పరుగుల వరద పారించాడు. తన శైలికి భిన్నంగా ఆడినప్పటికీ పరుగులు చేయడంలో ఏమాత్రం రిషబ్ పంత్ వెనుకాడ లేదు. వాస్తవానికి రిషబ్ పంత్ దూకుడుగా ఆడతాడు. ఏ ఫార్మాట్ అయినా సరే బీభత్సంగా పరుగులు తీస్తాడు.. కానీ రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం ఒక స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు కొరుకుడు పడని కొయ్యగా మారిపోయాడు. చెత్త బంతులను ఎంత వేగంగా అయితే బౌండరీలకు తరలించాడో.. ఇబ్బంది పెట్టిన బంతులను అదే స్థాయిలో డిఫెన్స్ ఆడాడు. అందువల్లే వరుసగా రెండవ సెంచరీ చేసి శిఖరగ్రాన నిలిచాడు. సెంచరీ తర్వాత రిషబ్ పంత్ సెలబ్రేషన్స్ తో అదరగొట్టాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
దాని వెనక అర్థం అదేనట
సెంచరీ చేసిన తర్వాత రిషబ్ పంత్ హెల్మెట్, గ్లవ్స్ తీసేసి మైదానంలో జంప్ చేస్తాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన తర్వాత కూడా అదే తీరుగా ప్రదర్శన చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తర్వాత రిషబ్ పంత్ సరికొత్తగా కనిపించాడు.. ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న సునీల్ గవాస్కర్ కూడా తొలి ఇన్నింగ్స్ మాదిరిగానే ప్రదర్శన చేయాలని కోరాడు. కాని దానికి రిషబ్ పంత్ ఒప్పుకోనట్టు తెలుస్తోంది. అంతేకాదు తన చూపుడు వేలు, బొటనవేలు మిక్స్ చేసి సున్నా అలా చేశాడు. అందులో నుంచి ఒక కన్నుతో సరికొత్తగా చూశాడు. దీనిని క్రీడా పరిభాషలో “డెలీ అలీ(Dele Alli) సెలబ్రేషన్” అని పిలుస్తారట. సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ప్రముఖ సాకర్ ఆటగాడు, టోటెన్ హమ్ హాట్స పర్ జట్టు ప్లేయర్ డెలీ అలీ(Dele Alli) 2018 ఆగస్టు నెలలో న్యూక్యాజిల్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. ఎవరు ఊహించని విధంగా గోల్ చేశాడు. ఆ తర్వాత ఈ స్థాయిలో సెలబ్రేషన్ చేసుకున్నాడు. అప్పట్లో ఇది సోషల్ మీడియాను ఊపేసింది.. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ఒకసారిగా తగ్గుముఖం పట్టింది. చివరికి రిషబ్ పంత్ వల్ల మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా డెలీ అలీ సెలబ్రేషన్ తో ఊగిపోతోంది.
Also Read: Rishabh Pant: రిషభ్ పంత్ కు భారీ జరిమానా విధించిన బీసీసీఐ
వాస్తవానికి రిషబ్ పంత్ సెంచరీ తర్వాత తనదైన మార్కుతో అదరగొడతాడు. మైదానాన్ని ఒకరకంగా జిమ్ లాగా మార్చేస్తాడు. తనకు మాత్రమే సాధ్యమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటాడు. స్టుపిడ్ స్టుపిడ్ స్టుపిడ్ అని వ్యాఖ్యానించిన వారితోనే సూపర్ సూపర్ అని పొగిడించుకుంటాడు. అయితే అలాంటి ఆటగాడు నిన్న మాత్రం తనకు మాత్రమే సాధ్యమైన సెలబ్రేషన్ తో ఆకట్టుకున్నాడు. ఎంతైనా రిషబ్ పంత్ డిఫరెంట్.