Allu Arjun Atlee Film Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్ (Allu Arjun)…కెరియర్ మొదట్లో చాలా వరకు విమర్శలు వచ్చినప్పటికి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనను విమర్శించిన వాళ్ళ చేతే సుభాష్ అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఇక పుష్ప (Pushpa) సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే పుష్ప 2(Pushpa 2 ) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం కొల్లగొట్టి బాహుబలి రికార్డ్ ను బ్రేక్ చేసి 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు…ప్రస్తుతం అట్లీ (Atlee) డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్ల వరకు బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్ ప్రపంచ స్థాయి హీరోగా మారలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని శరవేగంగా ఫినిష్ చేయాలని అట్లీ అండ్ టీం రాత్రింబవళ్లు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీలైనంత తొందరగా ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లి శరవేగంగా షూటింగ్ చేయాలనే ఆలోచనలో అట్లీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మూడు నెలల పాటు ముంబైలోనే షూటింగ్ జరపే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక దాని తర్వాత విఎఫ్ఎక్స్ కి సంబంధించిన పనులను కూడా స్టార్ట్ చేసి అవి కూడా వేగవంతం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి ప్రస్తుతం తన తోటి హీరోలందరు భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న క్రమంలో అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో చేస్తున్న సినిమాతో ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు. తద్వారా ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ విజయాన్ని నమోదు చేస్తాడా?
Also Read: Allu Arjun : అల్లు అర్జున్ అట్లీ ని బ్లైండ్ గా నమ్ముతున్నాడా..?
అలాగే ఇండియాలో ఉన్న పలు రికార్డులను సైతం బ్రేక్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇంతకుముందు వదిలిన కొన్ని వీడియోలు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీ లెవెల్ కి పెంచుతున్నాయి… ఈ సినిమాతో కనక సక్సెస్ ని సాధిస్తే వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకున్న హీరోగా హీరోగా ఒక గొప్ప పేరు సంపాదించుకుంటాడు.
అట్లీ సైతం ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నప్పటికి ఈ సినిమా భారీ గ్రాఫికల్ విజువల్ వండర్ గా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాని ఏ రేంజ్ సక్సెస్ గా నిలుపుతాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…