Rajasthan Royals Tweet: అనేక ఎదురుచూపులు తర్వాత.. దశాబ్దాల కాలం గడిచిపోయిన తర్వాత భారత జట్టు పొట్టి ప్రపంచ కప్ సాధించింది. రోహిత్ నాయకత్వంలో తుది పోరులో సఫారీలను మట్టి కరిపించింది. ఉత్కంఠగా సాగిన పోరులో చివరి వరకు పోరాడి విజయం అందుకుంది. తద్వారా 2007 తర్వాత 2024లో పొట్టి కప్ దక్కించుకుంది.
పొట్టి ప్రపంచ కప్ సాధించిన తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్ల ఆనందానికి అవధులు లేవు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ చిన్నపిల్లాడి మాదిరిగా ఏడ్చేశాడు. మైదానంలో జాతీయ జెండాను పాతేశాడు. తన పిడికిలితో మైదానాన్ని పదేపదే కొట్టి సాధించాం అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. మైదానం మీద అలా పడుకుని ఉండిపోయాడు. కప్ చేతుల్లో పట్టుకుని ఏడ్చేసాడు. కప్ స్వీకరించే సమయంలో విభిన్నమైన శైలిని అనుసరించాడు రోహిత్. గతంలో సాకర్ ప్రపంచ సాధించినప్పుడు ఫుట్ బాల్ ప్లేయర్లు అందుకున్నట్టుగానే.. అతడు కూడా టి20 ప్రపంచ కప్ స్వీకరించాడు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. టి20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్లు ముంబై నగరంలో విజయయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్షలాదిగా అభిమానులు వచ్చారు. అంతమంది అభిమానుల సమక్షంలో టీమిండియా ప్లేయర్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్మానించింది. కనీ విని ఎరుగని స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించింది.
Also Read: గౌతమ్ గంభీర్ చూస్తుండగానే.. కోచ్ మీద పడి టీమిండియా ప్లేయర్ల కొట్లాట.. షాకింగ్ వీడియో
భారత జట్టు విజయం సాధించి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కీలక ట్వీట్ లు చేసింది. అందులో పోస్ట్ చేసిన ఫోటోలు అద్భుతంగా ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఈ స్కెచ్ లు ఆకట్టుకుంటున్నాయి.. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్ల హావభావాలను ప్రస్తావిస్తూ ఈ స్కెచ్ లు రూపొందించారు. గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ రెండు పిడికిళ్లను బిగించి ఆకాశానికేసి చూడటం.. రోహిత్ మైదానంలో జెండా పాతడం.. విజయం సాధించిన అనంతరం చిన్నపిల్లాడి మాదిరిగా ఏడవడం.. సూర్య కుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడం.. ఈ దృశ్యాలను స్కెచ్ రూపంలో రూపొందించారు. వీటన్నింటినీ రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..
Also Read: 86 శతకాలు, 185 అర్ధ శతకాలు.. ఈ లెజెండరీ క్రికెటర్ ఇకలేరు..
” ఏడాది క్రితం రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా సాధించిన అద్భుతమైన విజయం ఇది. ఈ విజయం సాధించి ఏడాది పూర్తయింది. ఆ అద్భుతమైన అనుభూతిని మా కళ్ళ ముందు మరోసారి కనిపించేలా చేశారు. సాధారణమైన ఫోటోల మాదిరిగా కాకుండా స్కెచ్ రూపంలో వీటిని రూపొందించడం బాగుంది. ఆటగాళ్లకు మాత్రమే కాకుండా మాకు కూడా సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఇటువంటి ప్రయత్నం చేసినందుకు రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు అంటూ” నెటిజన్లు పేర్కొంటున్నారు.