Spiritual Life Lessons: దేవుడు అంటే అందరికీ ఇష్టమే. భక్తి కూడా చాలా ఉంటుంది. కానీ కష్టాలు వస్తే కారణం దేవుడు అని నిందాస్తారు. అదే సంతోషం వస్తే ఆనందంలో మునిగితేలుతారు కానీ ఆ దేవుడి వల్లే ఇలా ఉన్నాం అంటూ తలుచుకునే వారు చాలా తక్కువ. అయితే కష్టసుఖాలు అనేవి చాలా మందికి కామన్ గా వస్తుంటాయి. సమయం మారుతున్న కొద్ది మనిషి జీవితంలో మార్పులు వస్తుంటాయి. కొన్ని సార్లు ఆనందంగా, కొన్ని సార్లు దు:ఖంగా ఉంటారు. ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో కామన్ గా వస్తుంది. అయితే సమస్యలు వేరు వేరుగా ఉంటాయి. కానీ సమస్యలు రావడం, పోవడం మాత్రం ఖాయం. కానీ ఎంతగానో నమ్మే ఆ దేవుడిని నిందిస్తుంటారు చాలా మంది. మరి ఇది ఎంత వరకు కరెక్ట్?
తన లైఫ్ కి, తన ఫ్యామిలీ లైఫ్ కు కూడా పెద్ద దిక్కుగా ఆ దేవుడికి స్థానం ఇస్తారు. ఆయనే అన్నీ చూసుకుంటారు అని నమ్ముతారు. ఆ భగవంతుడికి తండ్రి స్థానాన్ని, అంతకు మించిన స్థానాన్ని ఇస్తారు. మరి అలా ఆ స్థానంలో ఉంచిన దేవుడిని నిందించడం కరెక్టా? తండ్రి తన పిల్లలకు ఎప్పుడూ దుఃఖం కలిగించడు. కాబట్టి, మన కష్టాలకు మనమే మూలకారణమని, కష్టాలు వచ్చిన వెంటనే, దేవుడిని నిందించడం మానేయాలని అంటున్నారు భక్తులు.
Also Read: కుటుంబ జీవితం బాగుండాలంటే.. ఈ ఉద్యోగాలు చేయొద్దు..
దురాశ, నిర్లక్ష్యం, మోసం, కపటత్వం వంటి చెడు పనులే మనకు కష్టాలను తెస్తాయట. ఇతరులతో పోల్చుకోవడం, అమాయకులను, బలహీనులను బలవంతంగా దోచుకోవడం వంటి చర్యలు కూడా మనకు కష్టాలను తెస్తాయి అని నమ్ముతుంటారు చాలా మంది.
గ్రంథాలలో చెప్పినట్లుగా, “నవభాగం మనుష్యానం, దశభాగం దైవాదీనం” అనే సూక్తి దీనికి నిదర్శనం. పదిలో తొమ్మిది మన కర్మల ద్వారా నిర్ణయం అవుతాయి. ఒక భాగం మాత్రమే దైవానుగ్రహం ద్వారా నిర్ణయం అవుతుంది అని తెలిపారు ప్రఖ్యాత జ్యోతిష్కుడు, వాస్తుశిల్పి డాక్టర్ బసవరాజ్ గురూజీ. అయితే అలసత్వం, విధిని అవమానించడం, జూదం వంటి చెడు అలవాట్లు ఇబ్బందులకు దారితీస్తాయి అనేది వాస్తవం.
Also Read: AI తో మురిసిపోతున్నాం గాని.. ఎంతమంది ఉపాధి ఊస్ట్ అవుతుందో తెలుసా?
అంతేకాదు బాధపడేవారికే ఆనందం వస్తుంది. ఆనందాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా మనం తిరిగి కష్టాల్లోకి పడిపోతాము. ఏ కష్టానికైనా దేవుడే కారణమని నమ్మకుండా, మన చర్యలకు బాధ్యత వహించి జీవితాన్ని సానుకూలంగా ఎదుర్కోవడం చాలా మంచిది. ఇలా ముందుకు వెళ్తుంటే ఎప్పటికైనా సరే మీ లైఫ్ లో మంచి జరుగుతుంది అని నమ్మండి. ఆ దేవుడి మీద భక్తితో ముందుకు వెళ్లండి. ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.