Homeక్రీడలుక్రికెట్‌Wayne Larkins Death: 86 శతకాలు, 185 అర్ధ శతకాలు.. ఈ లెజెండరీ క్రికెటర్ ఇకలేరు..

Wayne Larkins Death: 86 శతకాలు, 185 అర్ధ శతకాలు.. ఈ లెజెండరీ క్రికెటర్ ఇకలేరు..

Wayne Larkins Death: ప్రపంచానికి క్రికెట్ ను పరిచయం చేసిన ఇంగ్లీష్ దేశంలో అతడు ఓ తారాజువ్వ. క్రికెట్ లో నవశ కాన్ని లిఖించిన వెలుగు దివ్వె. అతడు మైదానంలోకి అడుగుపెడితే పూనకం వచ్చినట్టు ఆడేవాడు. బౌలర్ ఎవరనేది చూసేవాడు కాదు. పిచ్ ఎలాంటిదో పట్టించుకునే వాడు కాదు. బ్యాట్ పట్టుకుంటే చాలు బంతి పరుగులు పెట్టేది. బౌండరీ లైన్ సులభంగా దాటేది.. రన్స్ తామర తంపరగా వచ్చేవి. ఫలితంగా రికార్డులు అతడి పాదక్రాంతమయ్యేవి.

సెంచరీల మీద సెంచరీలు.. అర్థ శతకాల మీద అర్థ శతకాలు సాధించిన అతడు శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు. 71 సంవత్సరాల వయసులో కన్నుమూశాడు. అతని పేరు లార్కిన్స్. క్రికెట్ ప్రపంచంలో అతడు “నెడ్” గా పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ఘకాలం నుంచి అతడు తీవ్రమైన అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు.. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ శనివారం కన్నుమూశాడు.. 1953 నవంబర్ 22న రాక్ స్టన్ అనే గ్రామంలో అతడు పుట్టాడు. 1979 నుంచి 1991 వరకు ఇంగ్లీష్ జట్టు తరఫున లార్కిన్స్ 13 టెస్టులు ఆడాడు. 25 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 25 ఇన్నింగ్స్ లలో 20.54 సగటుతో 493 పరుగులు చేశాడు. వన్డేలలో 24.62 సగటుతో 591 రన్స్ చేశాడు. ఇక టెస్టులలో అతడు 3 అర్ధ సెంచరీలు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో ఒక సెంచరీ బాదాడు.

Also Read: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎక్కువ మద్యం సేవిస్తున్నారా? పురుషులా? ఏ రాష్ట్రంలో ఎక్కువ సేవిస్తారు?

లార్కిన్స్ ఇంగ్లీష్ జట్టుకు మాత్రమే కాకుండా డొమెస్టిక్ క్రికెట్లో నార్తాంప్టన్ షైర్, డర్హమ్, బెడ్ ఫోర్డ్ షైర్ వంటి జట్లకు అతడు ఆడాడు. డొమెస్టిక్ క్రికెట్ లో మొత్తం 482 ఫస్ట్ క్లాస్, 485 లిస్ట్ ఏ మ్యాచ్ లలో అతడు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 842 ఇన్నింగ్స్ లలో అతడు బ్యాటింగ్ చేశాడు. 34.44 సగటుతో 27,412 రన్స్ చేశాడు. లిస్టు ఏలో 467 ఇన్నింగ్స్ లలో అతడు బ్యాటింగ్ చేశాడు. 30.75 సగటుతో 13,594 రన్స్ చేశాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో లార్కిన్స్ 59 సెంచరీలు సాధించాడు. 116 హాఫ్ సెంచరీలు సొంతం చేసుకున్నాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 26 సెంచరీలు చేశాడు. 66 హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి వ్యక్తిగత ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇతడు ఏకంగా 252 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేయడం విశేషం. లిస్ట్ ఏ క్రికెట్ లో 172* పరుగుల అత్యధిక స్కోర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. లార్కిన్స్ ఇంటర్నేషనల్, డొమెస్టిక్ విభాగాలలో మొత్తం 1358 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 41,820. రన్స్ చేశాడు. అతడి పేరు మీద మొత్తం 86 సెంచరీలు, 185 సెంచరీలు ఉండడం విశేషం.

Also Read:చరిత్రలోనే ఇదో కామెడీ రన్ ఔట్.. పాకిస్తానోళ్లంతే బై.. చూసి నవ్వుకోవాల్సిందే

లార్కిన్స్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. మంచానికి పరిమితమయ్యాడు. ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు. అతడు కన్నుమూసిన నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియాలో తమ సంతాప సందేశాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular