Dhoni
MS Dhoni: అభిమానులు మిస్టర్ కూల్(Mista cool)గా పిలుచుకునే క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, తన కెప్టెన్సీలో వన్డే ప్రపంచ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు అనే విజాయాలు సాధించింది టీమిండియా. క్లిష్ట సమయంలోను జట్టును ఒంటిచేత్తో గెలిపిస్తాడు ధోనీ(Dhoni). అందుకే అతను స్పెషల్. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో మారు సారథ్య బాధ్యతలు చేపట్టారు. లక్నో(Lacno)తో జరిగిన మ్యాచ్‌లో జట్టును గెలిపించాడు. సోమవారం(ఏప్రిల్ 14న) లక్నోలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఒకవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ జెయింట్స్.. ఇంటోవైపు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన చెన్నై జట్లు.. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Also Read: వాళ్లతో ధోనికి ఫెవికాల్ బంధం ఉందనుకుంటా.. వామ్మో ఇన్ని రికార్డులా?
అద్భుత రనౌటః,,
ఈ మ్యాచ్‌లో ధోనీ చేసిన రన్ ఔట్(Run out) అద్భుతం. లక్నో బ్యాట్స్‌మెన్ బ్యాట్స్‌మెన్‌ను రన్‌ఔట్ చేసి తీరు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. బౌలర్ వేసిన బంతి వైడ్‌గా నేరుగా కీపర్ ధోనీ చేతుల్లో వెళ్లింది. అయితే మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ పరుగు కోసం ముందుకు వచ్చాడు దీంతో సమద్(Samad)కూడా పరుగు తీశాడు. అయితే ధోనీ తన చేతిలోని బంతిని కళ్లు మూసుకుని మరో ఎండ్‌లో ఉన్న వికెట్లవైపు విసిరాడు. అది నేరుగా వెళ్లి వికెట్లకు తగిలింది. దీంతో సమద్ రన్‌ఔట్ అయ్యాడు.
ఈ ఔట్ ధోనీ అభిమానుల ఉత్సాహం ఈ వీడియోను ట్రెండింగ్‌లో నిలిపింది.
వీడియో వైరల్..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఎంజాయ్ చేస్తున్నారు. కీపర్ అంటే ధోనీ.. దటీజ్ ధోనీ… మిస్టర్ కూల్‌తో అట్లుంటది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. డబుల్ తుక్కా.. టైమింగ్, ఆపర్చునిటీ.. దటీస్ ధోనీ.. మైండ్ బ్లోయింగ్ ఔట్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ వీడియో ఎందుకు ట్రెండ్ అయింది?
ధోనీకి భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానుల సంఖ్య ఉంది. అతను ఆటలో ఏ చిన్న సంఘటన జరిగినా అది వెంటనే సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది.
చెన్నై సూపర్ విక్టరీ..
ఇదిలా ఉంటే.. ఈమ్యాచ్‌లో చెనై్న ఘన విజంయ సాధించింది. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయి డీలా పడిన జట్టును ధోనీ తన మ్యాజిక్‌తో గెలిపించాడు. ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్ జట్టును ఓడించారు. దీంతో చెన్నై అభిమానులు పండుగ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లోనూ ధోనీ రాణించాడు. కీలక సమయంలో 11 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
Also Read: మ్యాచ్ ల గతి, గమనాన్ని మార్చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ !
#MSDhoni No Looks throw
There is no better wicketkeeper than Dhoni.
Dhoni is performing brilliantly regardless of his age.
Dhoni’s name will not be forgotten as long as cricket exists.#LSGvsCSK #CSKvsLSG pic.twitter.com/yvXiZZcWE5
— Shashi Kumar Reddy Vura (@vurashashi) April 14, 2025
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ms dhoni eyes closed run out viral video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com