Tollywood Anchor: బుల్లితెర తో పాటు వెండితెర మీద కూడా సందడి చేసిన ఈ నటి ఎవరో గుర్తుపట్టగలరా. సోషల్ మీడియాలో అయితే ఈమెకు ఉన్న భారీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ నటి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ అండ్ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ధనిక కుటుంబంలో జన్మించిన ఈ చిన్నది చదువులో కూడా బాగా చురుకు. ఆ తర్వాత ఈమె ఎంబీఏ లో హెచ్ ఆర్ మేనేజ్మెంట్ పూర్తి చేసి అమెరికాకు వెళ్ళింది. అమెరికాలో చాలా కాలం పాటు ఉద్యోగం చేసింది. ఆ సమయంలో టైం పాస్ కోసం ఈ బ్యూటీ తనకు సమయం దొరికినప్పుడు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అలాగే టిక్ టాక్ వీడియోలు చేసి ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈమెకు సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆ సమయంలోనే ఒక తెలుగు సినిమాలో నటించే అవకాశం కూడా ఈమెకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ అమెరికాలోనే కావడంతో అక్కడ జాబ్ చేస్తూనే షూటింగ్లో కూడా పాల్గొంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ బ్యూటీకి ఏకంగా బిగ్ బాస్ రియాల్టీ షోలో అవకాశం వచ్చింది.
Also Read: ఫౌజీ సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ చనిపోతాడా..? ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..?
దాంతో ఈమె జాబ్ ను అమెరికాను వదిలేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో నటిగా, యాంకర్ గా రాణిస్తూ మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె మరెవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ లో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో బాగా వినిపించింది. ఈ చిన్నది మరెవరో కాదు అశు రెడ్డి. ఈమె నితిన్ హీరోగా నటించిన చల్ మోహనరంగా సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో అమెరికాలో ఉండే కొన్ని సన్నివేశాలలో హీరోయిన్ కుటుంబ సభ్యురాలిగా కనిపిస్తుంది. 2018లో చల్ మోహనరంగా సినిమా రిలీజ్ అయింది.
ఆ మరుసటి సంవత్సరం 2019లో ఈమెకు బిగ్ బాస్ సీజన్ 3 లో అవకాశం వచ్చింది. దాంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈమె ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువగా టీవీ షోలోనే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఈ చిన్న దానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె షేర్ చేసే గ్లామరస్ ఫోటోలకు మరియు వీడియోలకు అభిమానుల నుంచి మంచి స్పందన ఉంటుంది.
View this post on Instagram