Mitchell starc: ఎడమ చేతివాటంతో.. అప్పటిదాకా వికెట్ల మీద వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్ల ఉత్సాహాన్ని నీరుగార్చాడు. బంతులకు బంతులు ఎదుర్కొన్నాడు. చెత్త బంతులను ఏమాత్రం వదిలిపెట్టకుండా శిక్షించాడు. వాటి మార్గం బౌండరీ వద్ద ఉందని.. అటువైపు తరలించాడు. మొత్తంగా 136 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో ఐదు బౌండరీలు ఉన్నాయి. క్యారీ తో 61 పరుగులు, లయన్ తో 14 పరుగులు, హేజిల్ వుడ్ తో 59 పరుగుల భాగస్వామ్యాలను స్టార్క్ నెలకొల్పాడు. స్టార్క్ దూకుడు వల్ల ఆస్ట్రేలియా చివరి మూడు వికెట్లకు 134 పరుగులు చేయడం విశేషం. ఈ 134 పరుగులు ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని అమాంతం పెంచేశాయ్..
అప్పుడు కూడా..
2023 డబ్ల్యూటీసీ తుది పోరులో కూడా స్టార్క్ అదరగొట్టాడు. నాడు రోహిత్ సేన పై ఏకంగా 41 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన అతడు అడ్డుగోడగా నిలబడ్డాడు. 57 బంతుల్లో 41 పరుగులు చేసి తన సత్తా ఏమిటో చూపించాడు. అందువల్లే 2023 డబ్ల్యూటీసీ తుది పోరులో కంగారు జట్టు విజయం సాధించింది. నాటి మ్యాచ్లో స్టార్క్ ను కనుక రోహిత్ సేన త్వరగా అవుట్ చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. అతడు అడ్డు గోడగా నిలబడి.. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. అంతేకాదు చెత్త బంతులను బౌండరీలుగా తరలించాడు. ఇక నాటి మ్యాచ్లో అతడు చేసిన 41 పరుగులు కంగారు జట్టు విజయానికి తోడ్పడ్డాయి. ప్రస్తుత సీజన్లో ప్రోటీస్ జట్టు పై 58 పరుగులు చేసి అజేయంగా నిలవడం కూడా కంగారు జట్టు విజయానికి దోహదం చేస్తుందని ఆస్ట్రేలియా అభిమానులు పేర్కొంటున్నారు. ప్రఖ్యాతమైన లార్డ్స్ మైదానంలో స్టార్క్ ఆడిన ఇన్నింగ్స్ చిరస్థాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
గొప్ప గొప్ప బ్యాటర్లు సైతం చేతులెత్తేసిన వేళ.. స్టార్క్ గట్టిగా నిలబడ్డాడు. మెరుగైన బ్యాటింగ్ చేశాడు. పరిస్థితులకు అనుగుణంగా పరుగులు సాధించాడు. అతడు గనుక నిలబడక పోయి ఉంటే దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేది. కానీ ఎప్పుడైతే అతడు అడ్డుగోడలాగా దక్షిణాఫ్రికా జట్టుకు అండగా నిలిచాడో.. అప్పుడే మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆస్ట్రేలియాకు కొండంత లీడ్ లభించింది. మరి దీనిని ఏ విధంగా దక్షిణాఫ్రికా జట్టు చేదిస్తుందో చూడాల్సి ఉంది. అన్నట్టు తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా ప్లేయర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. భారీగా పరుగులు చేయలేకపోయారు. కంగారు జట్టు బౌలర్ల ముందు దారుణంగా తేలిపోయారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అలాంటి ఆట తీరు ప్రదర్శిస్తే దక్షిణాఫ్రికా జట్టు ఏడుపు ముఖంతో ఇంటికి రావాల్సిందే.