Kubera Movie Pre-Release Event Details: టాలీవుడ్ ట్రేడ్ మొత్తం ఇప్పుడు ‘కుబేర'(Kubera Movie) చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే విడుదల అవ్వాల్సిన పెద్ద హీరోల సినిమాలు విడుదల అవ్వలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత థియేటర్స్ కి ప్రేక్షకులను భారీ గా రప్పించిన మరో సినిమా లేదు. మధ్యలో చిన్న సినిమాలు విడుదలై సూపర్ హిట్ అయ్యాయి కానీ, వాటి పరిధి చాలా తక్కువ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇలాంటి గడ్డు సమయంలో విడుదల కాబోతున్న ఈ క్రేజీ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. శేఖర్ కమ్ముల సినిమా అంటేనే మొదటి నుండి ప్రేక్షకుల్లో మినిమం గ్యారంటీ చిత్రం అనే బ్రాండ్ ఉంటుంది. పైగా ధనుష్(Dhanush),నాగార్జున(Akkineni Nagarjuna) వంటి స్టార్ హీరోలు కలిసి నటించారు కాబట్టి అంచనాలు వేరే రేంజ్ కి చేరుకున్నాయి.
నేడు గ్రాండ్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేశారు. అందుకు మూవీ టీం కారణం చెప్తూ ‘ నేడు జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అహమ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ ప్రమాదానికి సంతాపం గా రద్దు చేస్తున్నాం. చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. కుబేర టీం తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. మరో పక్క కన్నప్ప టీం కూడా నేడు విడుదల చేయాల్సిన థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్ ని రద్దు చేసుకున్నారు. ఇలా వివిధ సినిమాలకు సంబంధించిన టీమ్స్ మొత్తం తమ వంతు సంతాపం గా ఈ నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం అంటూ నెటిజెన్స్ కొనియాడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే ‘కుబేర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం రోజున, అనగా 15 వ తేదీన నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్ లో ధనుష్ కూడా పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ టాక్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటింగ్ తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాడని, కచ్చితంగా ఈ చిత్రం ట్రేడ్ ఆకలి తీరుస్తుందని అంటున్నారు. ఇంకా ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదల కావాల్సి ఉంది. రీ రికార్డింగ్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఓవర్సీస్ లో అన్ని ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. నార్త్ అమెరికా లో ఆశించిన స్థాయిలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. ట్రైలర్ విడుదల తర్వాత భారీ జుంప్స్ ఉంటాయని ఆశిస్తున్నారు.
The pre-release event of Kuberaa, scheduled for tomorrow, has been postponed in light of the tragic Ahmedabad flight crash. We stand in solidarity with the grieving families
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 12, 2025