Inzamam-ul-Haq On Abhishek Sharma: క్రికెట్లో బాగా ఆడే వాడికే ప్రశంసలు లభిస్తుంటాయి. అలాంటి వాళ్లకే గౌరవాలు దక్కుతుంటాయి. అలాంటి వాళ్లను చూసి మిగతావాళ్లు కుళ్ళుకోవడం సహజం. అయితే అలా కుళ్ళుకొని ఉండకుండా.. అలా ఆడుతున్న వ్యక్తి లాగా మనం కూడా తర్ఫీదు పొందాలని.. గొప్పగా ఆడాలని అనుకోవాలి. అంతేగాని గొప్పగా ఆడుతున్న వ్యక్తుల విషయంలో అన్వేషణ చేయకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా బొక్కలు వెతకకూడదు.
పాకిస్తాన్లో ఇంజ మామూల్ హాక్ అనే వ్యక్తి క్రికెట్ ఆడేవాడు . పాకిస్తాన్ జట్టుకు సారధిగా కూడా వ్యవహరించాడు. భారీ శరీరంతో క్రికెట్ ఆడేవాడు. పరుగులు తీయడానికి ఇష్టపడేవాడు కాదు. కాకపోతే అప్పుడప్పుడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడేవాడు. ఇతడి ఆధ్వర్యంలో పాకిస్తాన్ జట్టు చెప్పుకోదగ్గ స్థాయిలోనే విజయాలు సాధించింది. ఇప్పుడు ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించి.. తదుపరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉంటే సరిపోయేది.. కానీ ఈ మధ్య నోటికి పదును పెడుతున్నాడు. కుర్చీలో నుంచి లేచి నాలుగు అడుగులు వేయలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ అతడికి తిక్క కుదిరే విధంగా బుద్ధి చెబుతున్నారు.
ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో అభిషేక్ శర్మ వీర విహారం చేశాడు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. నిద్రలేని రాత్రులు అంటే ఎలా ఉంటాయో పరిచయం చేశాడు. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని సైతం జస్ట్ సింపుల్ గా కొట్టి అవతలపడేశాడు. వాస్తవానికి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిని ఎవరైనా సరే అభినందించాలి. అవసరమైతే అలాంటి ఆటను ఆడాలని తమ జట్టు ప్లేయర్లకు సూచించాలి. ఈ విషయాన్ని ఇంజమాముల్ మర్చిపోయాడు. పైగా తనక సీనియర్ క్రికెటర్ అనే విషయాన్ని కూడా వదిలిపెట్టాడు. లేకి నోటితో మురికి మాటలు మాట్లాడాడు. అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్ పెట్టారని.. అందుకే ఓడిపోయే మ్యాచ్లో కూడా ఇండియన్ గెలిపిస్తున్నాడని పిచ్చి వ్యాఖ్యలు చేశాడు.
బ్యాట్ లో చిప్ పెట్టడం సాధ్యమవుతుందా.. అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత కదా బ్యాట్ లోపలికి అనుమతించేది.. చిప్ పెడితే ఆటోమేటిక్ గా పరుగులు వస్తాయా? అలాంటప్పుడు ఇంజమాముల్ చేసిన పరుగులు కూడా అలా వచ్చిన వేనా? ఒక సీనియర్ ఆటగాడు అయి ఉండి ఇలా మాట్లాడవచ్చా.. పైగా గొప్ప ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ అభినందించాల్సింది పోయి ఇలా పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేయవచ్చా.. ఇదిగో ఇప్పుడు టీమ్ ఇండియా అభిమానులు ఇలా ఇంజ మామూల్ హక్ ను ప్రశ్నిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే నడి బజార్లో నిలబెడుతున్నారు.