TV5 Murthy challenge: మిగతా పాత్రికేయులకు టీవీ5లో పనిచేసే మూర్తికి చాలా తేడా ఉంటుంది. ఏదైనా విషయం చెప్పాలంటే ఓపెన్ గానే చెప్పేస్తాడు. అందులో ఎటువంటి దాపరికాలకు తావు ఉండదు. ముఖ్యంగా వివాదాస్పద అంశాల విషయంలో మాత్రం మూర్తి ముక్కుసూటిగా వెళుతుంటాడు. పైగా తనకి నచ్చిన విషయాలను కాకుండా.. బాధిత పక్షం వైపు ఉంటాడు. అందువల్లే అతడిని చాలామంది ఇష్టపడుతుంటారు. మిగతావారు వ్యతిరేకిస్తుంటారు.
ఆ మధ్య వేణు స్వామి విషయంలో కూడా మూర్తి ఇదేవిధంగా స్పందించాడు. రోజుల తరబడి డిబేట్లు పెట్టి ఏకంగా వేణు స్వామి చరిత్రను మొత్తం తవితీశాడు. చరిష్మాను నేలపాలు చేశాడు. ఏమాత్రం సంకోచించకుండా.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వెనకడుగు వేయకుండా.. ఏం చేయాలో అది చేశాడు. దీంతో వేణు స్వామి తలవంచక తప్పలేదు. తప్పుకోక తప్పలేదు. ఇక అప్పటినుంచి జ్యోతిష్యం చెప్పడం వేణు స్వామి మానేశాడు. టీవీ5 మూర్తి దెబ్బ అలా ఉంటుంది మరి.
ఇప్పుడు తాజాగా గౌతమి అనే మహిళ విషయంలో మూర్తి డిబేట్ల మీద డిబేట్లు పెడుతున్నాడు. అంతేకాదు ఎన్నడూ లేనివిధంగా మూర్తి రెచ్చిపోతున్నాడు. శివతాండవంలాగా ఆడుతున్నాడు. గౌతమికి అండగా నిలుస్తున్నాడు. అన్నట్టు ఈ గౌతమి మరి ఎవరో కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ధర్మ మహేష్ అనే నటుడి భార్య. ధర్మ మహేష్ గౌతమిని ఇబ్బంది పెడుతున్నాడు. ఆమెను ఆర్థికంగా వాడుకుంటూ.. ఇతర మహిళలతో సంబంధాలు నడుపుతున్నాడు. ఇదే విషయాన్ని గౌతమి ఇటీవల బయటపెట్టింది. అధికష్టా సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చి రచ్చ రచ్చ అయింది. మొదట్లో గౌతమి క్యారెక్టర్ మొత్తాన్ని తప్పుడుగా ప్రచారం చేశాడు ధర్మ మహేష్. ఎప్పుడైతే మూర్తి సీన్లోకి వచ్చాడో అప్పుడే పరిస్థితి మారిపోయింది.
ఇదే సమయంలో ధర్మ మహేష్ కూడా తనకున్న పలుకుబడిని ఉపయోగించి యూట్యూబ్ ఛానల్స్ లో గౌతమి మీద వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నాడు. ఒక రకంగా గౌతమిని తప్పుడుగా చిత్రీకరిస్తున్నాడు. ఇది తట్టుకోలేక గౌతమి మూర్తి సహాయం కోరింది. దీంతో అతడు తన ఛానల్లో లోతుగా కథనాలను ప్రసారం చేయించాడు. అంతేకాదు ధర్మ మహేష్ తండ్రి ని ఫోన్ ఇన్ లోకి తీసుకొని వాయించాడు. ఈ క్రమంలో కొంతమంది మూర్తికి బెదిరింపు కాల్స్ చేశారు. అసలే టెంపర్మెంట్ లో ఉండే మూర్తి తన అసలు కోణాన్ని చూపించాడు. తను ఎక్కడ ఉండేది.. ఎక్కడ పని చేసేది.. ఏ కార్ నెంబర్ వాడేది.. మొత్తం చెప్పేసాడు. ఇక ఏం చేస్తారో చేసుకోండి అంటూ సవాల్ విసిరాడు. అడ్రస్ అన్ని వివరాలు చెప్పాడు కాబట్టి ధర్మ మహేష్ రంగంలోకి దిగుతాడా.. ఏమైనా చేస్తాడా.. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.