Homeక్రీడలుక్రికెట్‌Gill Sara Rumors: సారా చూస్తుండగానే మరో అమ్మాయితో గిల్.. వైరల్ వీడియో

Gill Sara Rumors: సారా చూస్తుండగానే మరో అమ్మాయితో గిల్.. వైరల్ వీడియో

Gill Sara Rumors: “తనతో ఎటువంటి సంబంధం లేదు.. ఆమెను ఇంతవరకు చూడలేదు. మాట్లాడనూ లేదు. అయినప్పటికీ రకరకాల సంబంధాలు అంటగడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను. ఆ వ్యక్తితో నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఇలా సంబంధం ఎలా అంటగడతారు.. అడ్డగోలుగా ఎలా రాస్తారు.. ఇష్టానుసారంగా సూత్రీకరణలు ఎలా చేస్తారు.. ఇది న్యాయం కాదు కదా” సచిన్ కుమార్తె సారా తో రిలేషన్ పై ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు టీమ్ ఇండియా టెస్ట్ సారథి గిల్ చెప్పిన సమాధానం అది. గిల్ ఓపెన్ గానే తన సమాధానం చెప్పినప్పటికీ మీడియా వదిలిపెట్టడం లేదు. పైగా చిన్న చిన్న వీడియోలను కూడా గిల్ – సారా కు అనుసంధానం చేసి ప్రచారం చేస్తోంది. తాజాగా ఒక వీడియో కూడా అలానే వెలుగులోకి వచ్చింది.. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

Also Read:  టాలీవుడ్ యంగ్ హీరో తో డేటింగ్ లో సానియా మీర్జా..ఎవరా యంగ్ హీరో?

ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న గిల్.. ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉన్నాడు. ఒక తెలియని అమ్మాయితో మాట్లాడుతున్నాడు.. అతడు అలా మాట్లాడుతుండగా సారా అతడినే చూస్తూ ఉంది. కొంతకాలంగా సారా, గిల్ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. దీనిపై సారా, గిల్ అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ వీరి గురించి రకరకలా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ లో యువరాజ్ సింగ్ తన చారిటీ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి టీమిండియా లెజెండ్రీ ఆటగాడు సచిన్ భార్య అంజలి, కుమార్తె సారా తో కలిసి హాజరయ్యాడు. టీమిండి ఆటగాళ్లు కూడా ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం టీమిండియా కు సారధిగా గిల్ ఉన్నాడు కాబట్టి.. అందరి దృష్టి సారా, గిల్ మీద నెలకొంది.. ఒకవైపు గిల్, టీమిండియా క్రికెటర్లు కూర్చొని ఉన్నారు. మరోవైపు సచిన్, అతడి కుటుంబ సభ్యులు కూర్చుని ఉన్నారు.. ఈ క్రమంలోనే గిల్ పక్కన కూర్చున్న రవీంద్ర జడేజా సారా వైపు చూస్తూ ఆట పట్టించాడు.. దానికి గిల్ నవ్వి ఊరుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించింది. మళ్లీ ఇప్పుడు ఒక వీడియో వెలుగులోకి వచ్చింది.

Also Read:  ఏం షాట్ రా ఇదీ.. ఫ్యూజులు ఎగిరిపోయాయి

ఆ వీడియోలో గిల్ తెలియని ఒక అమ్మాయి తో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి ఎవరో బయటికి కనిపించలేదు.. గిల్ ఆ తెలియని అమ్మాయితో మాట్లాడుతుంటే.. కొంచెం దూరంగా ఉన్న సారా ఓ కుర్చీలో కూర్చొని ఆ సంభాషణ మొత్తం వింటోంది.. అయితే ఈ వీడియోలో గిల్ ను చూస్తున్న సారా ఇచ్చిన రియాక్షన్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది.. గిల్, సారా మొన్నటిదాకా బాగానే ఉన్నారని.. ఈ మధ్యనే బేధాభిప్రాయాలు వచ్చాయని.. అందువల్లే ఒకరంటే ఒకరు ఇష్టం లేదన్నట్టుగా ఉంటున్నారని.. గిల్ వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే సారా తట్టుకోలేకపోతుందని.. ఈ వీడియోనే అందుకు నిదర్శనమని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ వీడియో ద్వారా వారిద్దరి మధ్య ఉన్న బంధం మరోసారి బయటపడిందని చర్చించుకుంటున్నారు. నిప్పు లేనిదే పొగరాదని.. తమ వ్యవహారంలో పొగను సారా, గిల్ సృష్టించుకుంటున్నారని.. ఇక కొత్తగా చెప్పేది ఏముందని నెటిజన్లు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version