Homeఎంటర్టైన్మెంట్Akshay Kumar kind gesture: అతని మరణం, అక్షయ్ కుమార్ చేసిన పని తెలిస్తే భేష్...

Akshay Kumar kind gesture: అతని మరణం, అక్షయ్ కుమార్ చేసిన పని తెలిస్తే భేష్ అంటారు!

Akshay Kumar kind gesture: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(AKSHAY KUMAR) తన మంచి మనసు చాటుకున్నాడు. వందల మందికి భరోసాగా నిలిచాడు. ఆయన చేసిన మంచి తెలిస్తే భేష్ అని పొగడక మానరు. ఇంతకీ అక్షయ్ కుమార్ చేసిన ఆ సత్కార్యం ఏమిటో చూద్దాం..

బాలీవుడ్ బడా స్టార్స్ లో అక్షయ్ కుమార్ ఒకరు. రెండు దశాబ్దాలకు పైగా నటుడిగా కొనసాగుతున్నారు. అభిమానులు ఆయన్ని ఖిలాడీ అని ప్రేమగా పిలుచుకుంటారు. ఇండియా వైడ్ అభిమానులున్న అక్షయ్ కుమార్ విలక్షణ పాత్రలు, విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు. లెజెండ్ బ్రూస్ లీని అమితంగా ఆరాధించే అక్షయ్ కుమార్.. కి మార్షల్ ఆర్ట్స్, టైక్వాండో పాటు పలు యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం ఉంది. అందుకే అక్షయ్ కుమార్ యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉంటాయి.

Also Read: టాలీవుడ్ యంగ్ హీరో తో డేటింగ్ లో సానియా మీర్జా..ఎవరా యంగ్ హీరో?

తన సినిమాల్లో రిస్కీ స్టంట్స్ డూప్ లేకుండా నేరుగా చేస్తాడనే పేరుంది. స్టంట్స్ చేయడం ఎంత కఠినమైన వ్యవహారమో కూడా ఆయనకు తెలుసు. దశాబ్దాలుగా పలు చిత్ర పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాలు అనేక మంది ప్రాణాలు తీశాయి. హీరోలు ప్రాణాలు వదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి. రిస్కీ స్టంట్స్ చేస్తూ మరణించిన స్టంట్ మెన్స్ అయితే పదుల సంఖ్యలో ఉన్నారు. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచేందుకు ఈ స్టంట్ మెన్ తమ ప్రాణాలను పణంగా పెడతారు. ఇటీవల దర్శకుడు పా రంజిత్ మూవీ సెట్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వెట్టువం సినిమా షూటింగ్ లో భాగంగా కారుతో స్టంట్ మెన్ ఎస్ ఎం రాజు రిస్కీ స్టంట్ చేశాడు.

కారు పల్టీలు కొట్టడంతో ఎస్ ఎం రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు మృతిపై వివిధ పరిశ్రమల ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నటుడు విశాల్ ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తరచుగా ప్రమాదాలకు గురయ్యే స్టంట్ మెన్ కి ఆర్థిక భద్రత ఉండాలనే ఆలోచన చేసిన అక్షయ్ కుమార్… ఏకంగా 700 మందికి సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ చేయించారు. ఎవరైనా స్టంట్ మెన్ గాయపడితే వైద్య సహాయం, రూ.5 లక్షలు అందేలా చేశారు. ఒకవేళ ప్రాణం కోల్పోతే రూ.20-25 లక్షలు ఆ కుటుంబానికి దక్కేలా అక్షయ్ కుమార్ ఇన్సూరెన్స్ చేయించారు. ఈ విషయాన్ని బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ దహియా వెల్లడించారు.

Also Read: రష్మికకు భారీ షాక్… సమంత అంత తోపా?

అక్షయ్ కుమార్ చేసిన పనికి పరిశ్రమ ప్రముఖులు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ 5 పాజిటివ్ టాక్ దక్కించుకుంది. రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే మొదటిసారి అక్షయ్ కుమార్ తెలుగులో నటించారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప మూవీలో శివుడి పాత్ర చేశారు. ఏడాదికి అరడజను చిత్రాలు చేసే అక్షయ్ కుమార్ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Exit mobile version