Shubman Gill: గిల్‌ గొప్ప ఆటగాడే.. కానీ పోలికే సరిపోలేదు.. అప్పుడే వారితో పోల్చడం ఏంటి?

గిల్‌ వంటి టాలెంట్‌ ఉన్న ఆటగాడు అంత ఈజీగా దొరకడు అని కిరిస్టెన్‌ అభిప్రాయపడ్డాడు. టాలెంట్‌ను నిలబెట్టుకోవడం కూడా గొప్ప విషయం ముఖ్యంగా టీ20 క్రికెట్‌ ఇంత పాపులర్‌ అవుతున్న సమయంలో ఇలాంటి టాలెంట్‌ దొరకడం చాలా గొప్ప విషయం అని చెప్పాడు.

Written By: Raj Shekar, Updated On : June 3, 2023 5:57 pm

Shubman Gill

Follow us on

Shubman Gill: ఐపీఎల్‌లో ఈ ఏడాది అదరగొట్టిన బ్యాట్స్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్‌. సీజన్‌ ఆరంభం నుంచే మంచి ఫామ్‌ కనబరిచిన అతను.. చివర్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఏకంగా 890 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతో అభిమానులు, విశ్లేషకులు అతన్ని సచిన్, కోహ్లీతో పోల్చడం మొదలు పెట్టారు. దీనిని గుజరాత్‌ టౌటాన్స్‌ మెంటర్‌ గ్యారి కిరిస్టెన్‌ తప్పుపట్టాడు.

అప్పుడే అంత పోలికా?
గిల్‌ను స్టార్‌ క్రికెటర్స్‌ సచిన్‌ టెండుల్కర్, విరాట్‌ కోహ్లీతో పోల్చడం ఏమాత్రం సరికాదని కిరిస్టెన్‌ అభిప్రాయపడ్డాడు. ‘గిల్‌ ఒక యంగ్‌ ప్లేయర్‌. కాకపోతే ప్రపంచంలో బెస్ట్‌ ప్లేయర్లలో ఒకడిగా నిలవాలనే పట్టుదల, నైపుణ్యం ఉన్న కుర్రాడు. అతన్ని అప్పుడే సచిన్, కోహ్లీతో పోల్చడం కరెక్ట్‌ కాదు. అయితే అన్ని ఫార్మాట్లలో ఆడగలిగే టెక్నిక్స్‌ గిల్‌ వద్ద ఉన్నాయి’ అని కిర్‌స్టన్‌ చెప్పాడు.

ఇంతటి టాలెంట్‌ దొరకడం కష్టం..
గిల్‌ వంటి టాలెంట్‌ ఉన్న ఆటగాడు అంత ఈజీగా దొరకడు అని కిరిస్టెన్‌ అభిప్రాయపడ్డాడు. టాలెంట్‌ను నిలబెట్టుకోవడం కూడా గొప్ప విషయం ముఖ్యంగా టీ20 క్రికెట్‌ ఇంత పాపులర్‌ అవుతున్న సమయంలో ఇలాంటి టాలెంట్‌ దొరకడం చాలా గొప్ప విషయం అని చెప్పాడు. అలాగే తన ఆటను మరింత మెరుగు పరుచుకున్న గిల్‌ ఈ ఏడాది అద్భుతమైన స్థాయిని చేరుకున్నాడని పేర్కొన్నాడు. అదే సమయంలో తనకు దక్కుతున్న పొగడ్తలు చూసి పొంగిపోలేదని కొనియాడాడు. అదే గొప్ప క్రికెటర్‌ లక్షణమన్నారు. పొగడ్తలకు పొంగిపోయి విమర్శలకు ఒత్తిడికి లోనైతే క్రికెట్‌ ఆడడం కష్టమవుతుందని పేర్కొన్నాడు.

ఆత్మవిశ్వాసమే గిల్‌ బలం..
గిల్‌ బలం అతని ఆత్మవిశ్వాసం, తన స్టెమీనా ఏంటో తెలుసుకోవడమే అని పేర్కొన్నారు. అతని వర్క్‌ ఎథిక్స్, ప్రతి మ్యాచ్‌కు ముందూ రెడీఅయ్యే ప్రొఫెషనలిజం కూడా చాలా బాగుంటుందని వెల్లడించాడు. తన సత్తాకు తగ్గ ప్రదర్శన చేయడంతోపాటు ఆటను అర్థం చేసుకునే నైపుణ్యం కూడా గిల్‌కు ఉన్న మంచి బలమని తెలిపాడు. ఈ సీజన్‌లో తన బలాలను చక్కగా అర్థం చేసుకున్న గిల్‌.. వాటిని సరైన టైంలో వినియోగించి సత్తా చాటాడని వెల్లడించాడు. మరింత రాణించాలని, ఎదగాలని ఆకాంక్షించాడు. అప్పుడే పోలికలు మొదలు పెడితే సహజత్వం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపాడు.