Homeజాతీయ వార్తలుTelangana Formation Day: తెలంగాణ పుట్టిన రోజు వృథా ఖర్చు రూ.150 కోట్లు.. సొంత ప్రచారం...

Telangana Formation Day: తెలంగాణ పుట్టిన రోజు వృథా ఖర్చు రూ.150 కోట్లు.. సొంత ప్రచారం కోసం ప్రజాధనంతో యాడ్స్‌!

Telangana Formation Day: తెలంగాణ పుట్టిన రోజు వేడక పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది విపక్షాలు, విశ్లేషకుల నుంచి. బీఆర్‌ఎస్‌ ఇమేజ్‌ పెంచుకోవడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తొమ్మిదేళ్ల వేడుకను దశాబ్ది వేడుకలుగా మార్చారు. అంతటితో ఆగకుండా ఈ వేడుకలను చాలా కాస్ట్‌లీగా మార్చేశారు. కేవలం మీడియా ప్రకటనల కోసమే సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. పలు ఇంగ్లిష్‌ పేపర్లకు 6 పేజీల యాడ్స్‌ ఇవ్వగా.. కొన్ని తెలుగు పత్రికలకు 12 పేజీల వరకు ప్రకటనలు ఇచ్చారు.

నెలన్నర వ్యధిలో రూ.300 కోట్లు ఖర్చు…
తెలంగాణ ప్రభుత్వం నెలన్నర వ్యవధిలో కేవలం ప్రకటనల కోసమే రూ.300 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రభుత్వ నిధులతో బీఆర్‌ఎస్‌ పార్టీ గురించి ప్రచారం చేసుకోవడమే విమర్శలకు తావిస్తోంది. విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి.

వేడుక ఏదైనా యాడ్స్‌ కంపల్సరీ..
తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలలుగా వేడుక ఏదైనా ప్రభుత్వం పేరిట భారీగా మీడియాకు ప్రకటనలు ఇస్తుంది. దీంతో పత్రికలు, టీవీ చానెళ్లలోప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా చూసుకుంటోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఇందుకు వందల కోట్లు ఖర్చు చేస్తోంది. జూన్‌ 2న ఒక్క రోజునే సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ నిలువెత్తు బొమ్మలతో దేశ వ్యాప్తంగా పలు పత్రికలకు ప్రకటలు ఇచ్చారు. ఈ పబ్లిసిటీ దశాబ్ది వేడుకలు నిర్వహించే 21 రోజులు ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

సమాచార శాఖకు రూ,వెయ్యి కోట్ల బడ్జెట్‌..
మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళ్లాలని కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర సమాచార శాఖకు బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఇందులో జూన్‌ 2న ఒక్కరోజే రూ.150 కోట్లు ఖర్చు చేసింది. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.

– ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు సుమారు రూ.80 కోట్లు ప్రకటనలకు ఖర్చు చేశారు.
– ఏప్రిల్‌ 30న నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి రూ.100 కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ రెండు ప్రోగ్రామ్స్‌కు లోకల్, స్టేట్, నేషనల్‌ మీడియా సంస్థలకు సుమారు రూ.150 కోట్ల ఖర్చుతో యాడ్స్‌ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

సర్కారు సొమ్ముతో సొంత డబ్బా..
కేసీఆర్‌ ప్రభుత్వ నిధులతో పార్టీ గురించి ప్రచారం చేసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూన్‌ 2న ఆయన విడుదల చేసిన ప్రకటలను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దక్షణాది రాష్ట్రాలకు చెందిన ఏ సీఎంలు కేసీఆర్‌ మాదిరిగా ఇంత మొత్తంలో పబ్లిసిటీ చేసుకోలేదని రిటైర్డ్‌ ఐఏఎస్‌లు అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఇచ్చిన యాడ్స్‌ పూర్తిగా కేసీఆర్‌ ఫొటో మాత్రమే ఉంది. అయితే ఆయన ఫొటోకు ఎడమ వైపున అంబేడ్కర్‌ విగ్రహం, కింది భాగంలో కొత్త సెక్ర టేరియట్‌ ఫొటోను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసిన కేసీఆర్‌ దళితులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రాజభవనం లాంటి సెక్రటేరియట్‌ నిర్మించి ప్రజాధనం కేసీఆర్‌ బొమ్మ కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీని ఉత్తరాదిలో పరిచయం చేసు కునేందుకు జాతీయ మీడియాకు ప్రభుత్వ ఖర్చుతో ప్రకటలను ఇవ్వడం సరికాదని కామెంట్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version