Chris Gayle: క్రిస్ గేల్ టి20 లలో అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. ముఖ్యంగా ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు జట్టు తరఫున చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్లే పొట్టి ఫార్మాట్ లో గేల్ పేరు చెప్తే చాలు.. అనేక రికార్డులు గుర్తుకొస్తాయి. ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరఫున అతడు చేసిన 175* పరుగులు ఇప్పటికి హైయెస్ట్ రికార్డ్ గా ఉన్నాయి. 2013లో గేల్ సృష్టించిన ఈ రికార్డును.. ఇంతవరకు ఏ ఆటగాడు కూడా బద్దలు కొట్టలేకపోయాడు. దీనిని బట్టి గేల్ సృష్టించిన రికార్డు ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చు.. గేల్ మిగతా ఫార్మాట్ లో పర్వాలేదనిపించినప్పటికీ.. టి20 లలో మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించాడు. అందువల్లే గేల్ ను యూనివర్సల్ బాస్ అని పిలుస్తుంటారు. ఐపీఎల్ కు దూరమైనప్పటికీ.. క్రికెట్ కు సంబంధించిన ఏదో ఒక వ్యవహారంలో గేల్ కనిపిస్తూనే ఉంటాడు. తనదైన వాణి వినిపిస్తూనే ఉంటాడు.
Also Read: సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ పాస్.. ఇక చెన్నైకే మిగిలింది.. ట్రోల్స్ షురూ
ఎందుకు ఒత్తిడి పెంచుతున్నారు
క్రికెట్ కు సంబంధించి ఏదో ఒక వ్యవహారంలో గేల్ మాట్లాడుతూనే ఉంటాడు. తన పేరు ఉండేలాగా చూసుకుంటాడు.. అయితే తాజాగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పై గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ఐపీఎల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు సంబంధించిన వ్యవహారంపై గేల్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు..” విరాట్, రోహిత్ శర్మ గొప్ప ఆటగాళ్లు. వాళ్ళిద్దరూ ఇండియన్ క్రికెట్ కు చాలా చేశారు. గొప్ప గొప్ప విజయాలు అందించారు. సరికొత్త రికార్డులు సృష్టించారు. బెంచ్ మార్కులాంటి చరిత్రలను తమ పేరు మీద లిఖించుకున్నారు. అటువంటి ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకురావద్దు..ఫామ్ కు, వారి ఆటకు ఏమాత్రం సంబంధం లేదు. వారిదైన రోజు.. వారిది కాని రోజు కూడా వారిద్దరు ఆడతారు. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఎలా ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ ఎలా బ్యాటింగ్ చేశాడో ప్రస్తావించాల్సిన అవసరం లేదు కదా.. రోహిత్ గత వన్డే వరల్డ్ కప్ లో ఎలా ఆడాడో చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్, రోహిత్ లాంటి ఆటగాళ్లు వజ్రాలతో సమానం. వారికి మరింత సానపెట్టాలి. అంతేతప్ప సరిగ్గా ఆడటంలేదని రిటైర్ కావాలి అని కోరడం తప్పు. వారు ఇంకా కొంతకాలం పాటు క్రికెట్ ఆడాలి. అన్నింటికీ మించి వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. లేకపోతే భారత్ క్రికెట్ మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్ కూడా వారిదరి సేవలను, వారిద్దరి అమోఘమైన ఆటను మిస్ అవుతుందని” గేల్ వ్యాఖ్యానించాడు. మొత్తానికి తన మాటల ద్వారా విరాట్, రోహిత్ రిటైర్ కావాలని వస్తున్న విమర్శలకు గేల్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
Chris Gayle said, “Rohit Sharma and Virat Kohli still have a lot of cricket left in them. Let’s not push them out already. The cricketing world needs those guys for as long as possible”. (ANI). pic.twitter.com/40GqjfNsmL
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2025