Mallidi Vassishta: సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు సైతం టాలెంట్ ఉన్న దర్శకులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ శాసించే స్థాయికి ఎదిగిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్కును సెట్ చేశాడు. సినిమా అంటే విజువల్ ట్రీట్ గా ఉండాలనే ఒక స్టాండర్డ్ ని సెట్ చేసి పెట్టిన రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ లో సైతం తన మ్యాజిక్ ని క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక రాజమౌళి వేసిన బాటలోనే పలువురు దర్శకులు సైతం ఇస్తున్నారు అంటే దర్శకుడు సైతం నడుస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర(Vishvambhara) సినిమాతో చిరంజీవి ని డైరెక్ట్ చేయడమే కాకుండా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ ను హీరోగా పెట్టి చేసిన ‘బింబిసార’ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ మూవీ ప్రేక్షకులందరికి విపరీతంగా నచ్చింది. దాంతోపాటుగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు అంటూ ఆయనకు కూడా నటుడిగా మంచి గుర్తింపైతే లభించింది. వశిష్ట ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మల్లాది సత్యనారాయణ రెడ్డి గారి కొడుకు కావడం విశేషం… అయితే వశిష్ట ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హీరోగా ఒక సినిమా కూడా చేశాడు.
Also Read: శ్రీలీల ఈ అందాలన్నీ ఎక్కడ పోశావమ్మా..?
ఇక ఆ తర్వాత ఆయన హీరో మెటీరియల్ కాదని తెలుసుకున్న తను ఎలాగైనా సరే స్టార్ట్ డైరెక్టర్ గా మారాలనే ఉద్దేశ్యంతో డైరెక్షన్ కి సంబంధించిన మెలకువలు తెలుసుకున్నాడు. ఇక నితిన్ ఇష్క్ సినిమాకి ముందు వశిష్ట తనతో ఒక సినిమా చేయాలని అనుకున్నారట.
కానీ ఇష్క్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో నితిన్ కి మంచి అవకాశాలైతే వచ్చాయి. ఇక ఆ తర్వాత కొత్త దర్శకుడితో సినిమాలు చేయడం కుదరదు అంటూ నితిన్ కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు. దానివల్ల అతనితో సినిమా చేయలేకపోయాడు… అలాగే అల్లు శిరీష్ వశిష్ట తో ఒక సినిమా చేయాలనుకున్నాడు కానీ అతనికి ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమాతో మంచి విజయం లభించడంతో ఆయన కూడా వశిష్ట తో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదట.
కానీ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు శిరీష్ వాళ్ళ ఫాదర్ అయిన అల్లు అరవింద్ మాత్రం నువ్వు రాసుకున్న కథకి ఏ హీరో అయితే సెట్ అవుతాడో చెప్పు ఆ హీరోతో నీకు నేను సినిమా సెట్ చేయిస్తాను అంటూ వశిష్టకు మాటిచ్చారట. మొత్తానికైతే కెరియర్ స్టార్టింగ్ లో వశిష్ఠకి నితిన్, అల్లు శిరీష్ ఇద్దరు కూడా హ్యాండ్ ఇవ్వడం అనేది ఆయన కొంత కాలం పాటు డిప్రెషన్ లోకి వెళ్ళడానికి కారణం అయిందట…