Chennai Super Kings: మీమ్స్, షార్ట్ వీడియోలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, స్నాప్ చాట్..ఇలా ఏ సోషల్ మీడియా వేదిక చూసుకున్నా ఐపీఎల్ కి సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి.. ఇక కొన్ని మ్యాచులకు సంబంధించి వీడియోలను సినిమాలలోని దృశ్యాలతో అనుసంధానం నుంచి రీల్స్ లాగా, షార్ట్ వీడియోల లాగా రూపొందిస్తున్నారు.. వీటి ద్వారా ఫేమస్ కూడా అయిపోతున్నారు. ఇక తాజాగా చెన్నై జట్టుపై రూపొందించిన ఓ సెటారికల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read: రోహిత్ శర్మ అంటే మినిమం ఉంటది.. వైరల్ వీడియో
మా వాడు ఎందుకు పాస్ కావడం లేదు
అందుకే ఆ మధ్య తెలుగులో హిట్ అయిన ఓ సినిమా లో దృశ్యాన్ని చెన్నై జట్టుకు ఆపాదించిన తీరు అద్భుతంగా ఉంది. ఆ వీడియోలో ముగ్గురు స్నేహితులు ఉంటారు. ఇద్దరు స్నేహితులు టెన్త్ పరీక్షలు పాస్ అవుతారు. మరో స్నేహితులు మాత్రం పాస్కార్డ్. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫెయిల్ అయిన విద్యార్థి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. వారిద్దరూ పాసయ్యారు.. నువ్వెప్పుడు పాస్ అవుతావు అంటూ ఆ విద్యార్థినిని తిడతాడు. పాసైన విద్యార్థులను ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లుగా పేర్కొని.. పాస్ కాని వ్యక్తిని చెన్నై సూపర్ కింగ్స్ గా పేర్కొంటూ ఈ వీడియోను రూపొందించారు. 2023లో చెన్నై విజేతగా నిలిచి.. గత సీజన్లో ప్లే ఆఫ్ దాకా వెళ్లి.. ఈ సీజన్ లో మాత్రం దారుణమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది చెన్నై. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. ఇక సోమవారం లక్నో జట్టుతో జరిగే మ్యాచ్ చెన్నైకి అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో కనుక చెన్నై ఓడిపోతే ప్లే ఆ భాషలో అత్యంత సంక్లిష్టంగా మారుతాయి. ధోని ఆధ్వర్యంలో ఇటీవల చెన్నై జట్టు సొంత గడ్డపై కోల్ కతా జట్టు చేతిలో దారుణమైన ఓటమి ఎదుర్కొంది. మరి ఇప్పుడు సోమవారం జరిగే మ్యాచ్లో చెన్నై జట్టు ఎలాంటి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాల్సి ఉంది.
ధోని నాయకత్వంలోనూ చెన్నై జట్టు సరికొత్తగా ఆడాలని అభిమానులు కోరుతున్నారు..”చెన్నై ఐదు సార్లు విజేతగా నిలిచింది. ఒకరకంగా ఐపీఎల్ మొత్తాన్ని శాసించింది. కానీ ఇప్పుడేమో ఇలా ఆడుతోంది. జట్టు దుస్థితి చూస్తే బాధేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై జట్టులో సమూల మార్పులు జరగాలి. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు అవకాశాలు కల్పించాలి. ఫామ్ లోని ఆటగాళ్లను దూరం పెట్టాలి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో సరికొత్తగా కనిపించాలి. అప్పుడే చెన్నై విజయం సాధిస్తుంది. లేనిపక్షంలో ఇంటికి వెళుతుంది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచింది కాబట్టి.. చెన్నై సరికొత్తగా ఆడాలి. మైదానంలో అద్భుతాలు సృష్టించాలని” చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
Baane hand icharu ga @mipaltan @SunRisers pic.twitter.com/aqlSVo1EM3
— ᴹˢᴰ’ⁱᵃⁿ (@Siddu__9999) April 13, 2025