Chennai players : ఐపీఎల్ అనేది చిన్న ఫార్మాట్. దీనిని పొట్టి ఫార్మాట్ అని కూడా పిలుస్తారు. 20 ఓవర్లలోనే పూర్తిస్థాయిలో విధ్వంసం జరిగిపోవాలి. బంతి పగిలిపోవాలి.. బ్యాట్ విరిగిపోవాలి.. టి20 ఫార్మాట్ లో మిగితా టోర్నీలు ఎలా ఉన్నా .. ఐపీఎల్ అనేది పూర్తి విభిన్నమైనది. ఇక్కడ ఎంత వేగంగా పరుగులు చేస్తే.. జట్టుకు అంత ఉపయోగం ఉంటుంది. అలాకాకుండా వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే మాత్రం జట్టు ఓడిపోతుంది. ఆ తర్వాత అలా ప్రయత్నించిన ఆటగాడికి జట్టులో స్థానం పోతుంది. ఐపీఎల్ చరిత్రలో అనేక ఉదంతాలు ఇదే నిరూపించాయి. అందువల్లే జట్ల యాజమాన్యాలు దూకుడుగా ఆడేందుకు మాత్రమే ప్రయత్నించాలని ఆటగాళ్లకు సూచిస్తుంటాయి. అందువల్లే ఆటగాళ్లు కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటారు. చిత్ర విచిత్రమైన షాట్లు ఆడుతూ.. వైట్ బాల్ ఫార్మాట్లోనే సరికొత్త చరిత్రను సృష్టిస్తుంటారు.. ఇక మంగళవారం జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టుపై పంజాబ్ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య ఏకంగా 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తోటి ఆటగాళ్లు మొత్తం చేతులెత్తేసినప్పటికీ అతడు ఒక్కడే జట్టు బరువును మోసాడు. పంజాబ్ జట్టు చేసిన 221 పరుగులలో.. సగం స్కోరు ప్రియాన్ష్ చేశాడు.
Also Read : ఓహో అశ్విన్ యూ ట్యూబ్ చానెల్ లో CSK మ్యాచ్ ల రివ్యూ.. అందుకే చెప్పడం లేదా..
టెస్ట్ మాదిరిగా
ఐపీఎల్ సూత్రమె తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడం.. కానీ ఈ విషయాన్ని చెన్నై ఆటగాళ్లు మర్చిపోతున్నారు. ఐదుసార్లు ట్రోఫీని గెలిచిన చెన్నై జట్టులో ఈసారి ఆటగాళ్లు ఎందుకో బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపిస్తున్నారు. ఈ సీజన్లో అత్యధిక బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో నలుగురు చెన్నై ప్లేయర్ లు ఉండడం విశేషం. ఈ జాబితాలో విజయ్ శంకర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో విజయ్ శంకర్ 43 బందులో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. ఇక ఇటీవల ముంబై ఇండియన్స్ మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర హాఫ్ సెంచరీ చేయడానికి 42 బంతులు ఉపయోగించుకున్నాడు.. ఇక పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ చేయడానికి 40 బంతులు కావలసి వచ్చింది. బెంగళూరు ఆటగాడు లివింగ్ స్టోన్ గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడానికి 39 బంతులు తీసుకున్నాడు.. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ చేయడానికి 37 బంతులు కావలసి వచ్చింది. ఇక మంగళవారం చండీగఢ్లోని ముల్లాన్ పూర్ ప్రాంతంలో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై ఆటగాడు కాన్వే హాఫ్ సెంచరీ చేయడానికి 37 బంతులు ఉపయోగించడం విశేషం.
కాన్వే హాఫ్ సెంచరీ చేయడానికి 37 బంతులు ఉపయోగించడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆడుతోంది ఐపీఎల్ కదా.. టెస్ట్ మ్యాచ్ మాదిరిగా బ్యాటింగ్ చేస్తే ఎలా.. ఇలా అయితే జట్టు ఎలా గెలుస్తుంది.. బంతులు మింగడం కాదు.. ధైర్యంగా పరుగులు చేయాలి. భీకరంగా బ్యాటింగ్ చేయాలి. అప్పుడే జట్టు విజయతీరాలకు చేరుతుందని.. క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా చెన్నై ఆటగాళ్లు తమ ఆట తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : ధోని రిటర్మెంట్..CSK కోచ్ కీలక ప్రకటన..