Champions Trophy 2025
Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే హక్కులు పాకిస్థాన్‌కు ఇచ్చినప్పటి నుండి ఐసిసి నిరంతరం ప్రశ్నలను ఎదుర్కొంటోంది. భారత జట్టు తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతోంది కానీ మిగిలిన జట్లు దుబాయ్ , పాకిస్తాన్ మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. దీని కారణంగా ఇతర జట్లు లాజిస్టికల్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చాలా మంది మాజీ క్రికెటర్లు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇప్పుడు వెస్టిండీస్ మాజీ క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్ కూడా ఐసీసీని ప్రశ్నించారు.
భారత్ కాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించిన మిగిలిన జట్ల మనస్సులో ఈ ప్రశ్న తిరుగుతూ ఉండాలి. గ్రూప్ ఎ లో భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్లోకి తమ స్థానాన్ని నిర్ధారించుకున్నాయి. గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఇప్పుడు సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ వేదిక భారత్ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. భారత్ తో మ్యాచ్ లు ఆడాలంటే జట్లు దుబాయ్ కు రావాల్సిందే. దీని వల్ల తలెత్తే సమస్యలకు జవాబుదారీతనం నిర్ణయించే అంశంపై వివియన్ రిచర్డ్స్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Also Read : ఇదే జరిగితే సెమీ ఫైనల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్
మార్చి 2న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ఇది రాజకీయాల కారణంగా జరిగే ప్రక్రియగా కనిపిస్తుందేమో, కానీ నేను రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం లేదు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఐసీసీ బాధ్యత.ఈ సమస్యలన్నింటికీ ఐసీసీనే బాధ్యులని నేను భావిస్తున్నాను. వారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఎందుకు జరుగుతుందో మీరు చెప్పాలి.” అంటూ ఐసీసీకు ప్రశ్నలు సంధించారు.
క్రీడలు అందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలవని రిచర్డ్స్ అన్నారు. అంతకుముందు, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు నాసర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్ కూడా ఇతర జట్లు ప్రయాణం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ప్రశ్నలు లేవనెత్తారు. టోర్నమెంట్‌లో ప్రతి ఒక్క జట్టుకు భారత్ కు లభించే సౌకర్యాలను అందించడంలో ఐసిసి విఫలమైందని విమర్శకులు అంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశం పాకిస్తాన్ సందర్శించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారి మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగాయి.
Also Read : చాంపియన్స్ ట్రోఫీలో సెమీ చేరిన సౌత్ ఆఫ్రికా.. ఎవరికి చేటు?