Ravi Teja
Ravi Teja : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక కొంతమంది పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే మరి కొంతమంది మాత్రం సక్సెస్ లను సాధించలేక డీలా పడిపోతున్నారు… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే సినిమాలు చేయగలిగే ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నే అనే విషయం అందరికీ అర్థమైంది…
మాస్ మహారాజా గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ (Raviteja)…ఆయన ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసిన ఆయన ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ లాంటి సినిమాలతో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎవ్వరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన నటులలో చిరంజీవి తర్వాత అంత గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న హీరో కూడా రవితేజనే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే అప్పట్లో రవితేజ చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. ఒకానొక సందర్భంలో రవితేజ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు అది మినిమం గ్యారంటీ సినిమా అనే గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ గత కొద్ది రోజుల నుంచి ఆయనకు వరుసగా ప్లాప్ సినిమాలైతే వస్తున్నాయి.
Also Read : తేజ డైరెక్షన్ లో రవితేజ చేయాల్సిన సినిమా ఎందుకు మిస్ అయింది..? ఆ సూపర్ హిట్ సినిమాను ఎవరు చేశారో తెలుసా..?
ధమాకా సినిమా తర్వాత ఆయన ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేకపోయాడు. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో వింటేజ్ రవితేజ ను మనం చూడబోతున్నాం అనేది సినిమా టీజర్ ని చూస్తే అర్థమవుతుంది.
అయితే మంచు విష్ణుకి రవితేజ కి మధ్య మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. దాంతోనే ఆయన చేయాల్సిన సినిమాని మంచు విష్ణు కి ఇచ్చేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు చేసిన ‘ఢీ’ సినిమా స్టోరీ ని మొదట రవితేజ తో చేయాలని శ్రీను వైట్ల అనుకున్నాడట. కానీ మోహన్ బాబు ఈ సినిమా స్క్రిప్ట్ విని ఈ సినిమాని మంచు విష్ణుతో చేయమని చెప్పడంతో శ్రీను వైట్ల నేను అప్పటికే రవితేజకు కమిట్ అయ్యానని చెప్పారట.
దాంతో శ్రీనువైట్ల ముందే మోహన్ బాబు రవితేజ కి ఫోన్ చేసి ఈ స్క్రిప్ట్ ను విష్ణు చేస్తున్నాడని చెప్పడంతో రవితేజ కూడా ఓకే అని చెప్పేశారట. మొత్తానికైతే రవితేజ చేయాల్సిన సినిమాని మంచు విష్ణు చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక తన కెరియర్లోనే సూపర్ సక్సెస్ అయిన సినిమాల్లో ఢీ సినిమా ఒకటని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఈ సినిమాలోని డైలాగ్స్ ను ప్రస్తుతం మీమ్స్ గా వాడుతున్నారు…
Also Read : రూటు మార్చిన మాస్ మహరాజ్, క్లాస్ చిత్రాల దర్శకుడికి ఛాన్స్… రవితేజకు హిట్ పడేనా?