Sankranthi vasthunam : సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. రెగ్యులర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే దర్శకులు రోటీన్ సినిమాలు చేయడమే కాకుండా యావత్ ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా వాళ్ళ సినిమాలను తీర్చిదిద్దుతూ ఉంటారు. అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సినిమా సినిమాకు ఏదో ఒక కొత్త పాయింట్ ను తీసుకొచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి ప్రేక్షకుల ముందు ఉంచుతున్నాడు. మరి ఇలాంటి దర్శకుడు చేస్తున్న సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన లాంటి దర్శకుడు ఉండడంవల్ల సినిమా సక్సెస్ రేట్ అనేది కొంతవరకు పెరుగుతుందనే చెప్పాలి. అనిల్ రొటీన్ సినిమాలు చేస్తాడనే టాక్ ఉన్నప్పటికి ఆయన ట్రీట్మెంట్ విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టించకుండా సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమైతే చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన ఆయన ఇప్పుడు చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్టును చేయబోతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ భార్యాభర్తలుగా నటించారు.
ఈ సినిమాలో ఒక సన్నివేశం అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఉందని కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటి అంటే ఐశ్వర్య రాజేష్ కి భరతనాట్యం అంటే ఇష్టం ఉంటుంది…దాంతో తన భర్త అయిన వెంకటేష్ ఆమె కోసం ఒక స్టేజ్ పర్ఫామెన్స్ ని ఏర్పాటు చేస్తాడు. అందులో తను చాలా బాగా డ్యాన్స్ చేయడంతో లోకల్ ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్ అయ్యంగార్ ఆమెకి బహుమతి ఇవ్వడానికి వస్తాడు.
Also Read : ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూసిన ఆడియన్స్ కి షాక్, కారణం ఇదే! డైరెక్టర్ ఇలా చేశాడేంటి?
ఇక అదే సమయంలో ఐశ్వర్య రాజేష్ మాత్రం ఈ అవార్డు ను ఎమ్మెల్యే చేస్తుల మీదుగా కాకుండా తన భర్త అయిన వెంకటేష్ చేతుల మీద నుంచి అవార్డును తీసుకోవాలనుకుంటుంది. ఇక ఇదే సన్నివేశం గత కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ ఒక అవార్డు ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఇలాగే జరిగింది. తను నయనతార కి అవార్డు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పక్కనున్న హోస్ట్ అల్లు అర్జున్ చేతుల మీద నుంచి నయనతార కి అవార్డును ఇప్పించే ప్రయత్నం చేశాడు.
కానీ నయనతార మాత్రం అల్లు అర్జున్ చేతుల మీదుగా కాకుండా తన భర్త అయిన విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా అవార్డును తీసుకుంటానని చెప్పడంతో అల్లు అర్జున్ సైలెంట్ గా పక్కకు జరిగాడు…అల్లు అర్జున్ కి జరిగిన ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ను తీసుకొనే అనిల్ రావిపూడి ఈ సినిమాలో అలాంటి సీన్ రాశాడంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు…
Also Read : బాలీవుడ్ లో రీమేక్ కానున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’..సూపర్ స్టార్ డేట్స్ ని పట్టేసిన దిల్ రాజు!