రోహిత్ 10 ఓవర్ల వరకు మాత్రమే మైదానంలో ఉంటే సరిపోదు. అతడు పరిణతి కొనసాగించాలి. సమయోచితంగా ఆడాలి. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడాలి. అప్పుడే జట్టులో మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.” రోహిత్ ఇటీవల కాలంలో జరిగిన మ్యాచ్లలో త్వరగా అవుట్ అవుతున్న నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు ఇవి.
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడు.. ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్న సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో మెరిశాడు. న్యూజిలాండ్ బౌలర్ల పై దూకుడు కొనసాగించాడు. 47 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 56 పరుగులు చేశాడు.. మరో ఓపెనర్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు 13.2 ఓవర్లలో 79 పరుగులు (ఈ కథనం రాసే సమయం వరకు) చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు టీం ఇండియా నాలుగు మ్యాచ్లు ఆడింది. ఈ నాలుగు మ్యాచ్లలో రోహిత్ శర్మ తన స్థాయికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. గిల్ లేదా శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి వారు కీలక సమయంలో నిలబడటం వల్ల.. బలమైన ఇన్నింగ్స్ ఆడటం వల్ల రోహిత్ శర్మ అవుట్ అయినా ఆ ప్రభావం జట్టు మీద కనిపించలేదు. అయితే రోహిత్ శర్మ త్వరగా అవుట్ అవుతున్న నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లు అతనిపై విమర్శలు గుప్పించారు. ” రోహిత్ త్వరగా అవుట్ అవుతున్నాడు. అలా అవుట్ అవ్వడం సరికాదు. అతడు సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాలి. అప్పుడే మిగతా ఆటగాళ్ల మీద ఒత్తిడి తగ్గుతుంది. అలా రోహిత్ ఆడని సమక్షంలో ప్రత్యర్థులకు అనవసరంగా అడ్వాంటేజ్ లభిస్తుందని” సీనియర్ క్రికెటర్లు వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు.
ఆ ప్రభావం వల్లే..
సీనియర్ క్రికెటర్లు చేస్తున్న ఆరోపణలవల్లే రోహిత్ శర్మ ఒక్కసారిగా తన గేర్ మార్చాడు. ఫైనల్ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ గిల్ నిదానంగా ఆడుతున్నప్పటికీ.. రోహిత్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఏమాత్రం లక్షపెట్టకుండా బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. బ్యాట్ మీదికి వచ్చిన బంతులను సిక్సర్లుగా మలుస్తూ అదరగొట్టాడు. తనలో ఉన్న అసలు సిసలైన ఆటగాడిని దుబాయ్ లోని టీమిండియా ప్రేక్షకులకు రుచి చూపించాడు. రోహిత్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో దుబాయ్ మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. రోహిత్ రోహిత్ అంటూ హిట్ మాన్ నామస్మరణ చేశారు. ప్రేక్షకులు కేరింతలు కొడుతున్న నేపథ్యంలో.. రోహిత్ కూడా బ్యాట్ తో తాండవం చేశాడు. బౌలర్ ఎవరనేది లెక్కపెట్టకుండా దూకుడుగా ఆడాడు. సిక్సర్లు, ఫోర్ లతో దుబాయ్ మైదానాన్ని షేక్ చేశాడు. సిక్సర్లు కొట్టిన సమయంలో రోహిత్ అత్యంత కసి తో కనిపించాడు.
Rohit Sharma takes to the skies early on in the powerplay ✈️
Catch the Final Live in India on @StarSportsIndia.
Here are the global broadcast details: https://t.co/S0poKnxpTX#ChampionsTrophy #INDvNZ pic.twitter.com/5yiwmpr9dO
— ICC (@ICC) March 9, 2025